Updated : 01/06/2021 13:43 IST

H1B Visa: క్లౌడ్‌జెన్‌ వీసా స్కాం..!

ఇంటర్నెట్‌డెస్క్‌: క్లౌడ్‌జెన్‌ అనే సంస్థ భారతీయులను ఊరించి హెచ్‌1బీ వీసాలతో అమెరికా రప్పిస్తున్నట్లు తేలింది. ఈ  విషయాన్ని ఆ కంపెనీ ప్రతినిధి జోమన్‌ చెక్కలక్కల్‌ హూస్టన్‌లోని అమెరికా ఫెడరల్‌ కోర్టులో అంగీకరించారు. ఈ స్కామ్‌ను అక్కడి ప్రాసిక్యూటర్‌ ‘బెంచ్‌ అండ్‌ స్విచ్‌’గా అభివర్ణించారు. ఈ స్కామ్‌లో క్లౌడ్‌జెన్‌ సంస్థ గుర్తించిన కొందరు వ్యక్తులను అమెరికాకు తెప్పించేందుకు కొన్ని ఫొర్జరీ చేసిన కాంట్రాక్టులను అమెరికా అధికారులకు సమర్పిస్తుంది. ఆయా వ్యక్తులు అమెరికాలో కొన్ని సంస్థలకు పనిచేయాల్సి ఉంటుందని తెలిపి.. వారికి వీసాలు మంజూరు చేయించి అక్కడికి రప్పిస్తుంది. అమెరికా చేరిన వారిని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉంచుతుంది. ఆ తర్వాత క్లౌడ్‌జెన్‌ వద్దకు వచ్చే కాంట్రాక్టులను బట్టి వారికి ఉద్యోగాలను చూపిస్తుంది.

ఇలా చేయడం వల్ల క్లౌడ్‌ జెన్‌ వద్ద రిజర్వు బెంచ్‌లో ఎప్పుడూ సిబ్బంది ఉంటారు. లేదా వీసాలకు సిద్ధంగా ఉద్యోగులు అందుబాటులో ఉంటారు. దీంతో ఆయా మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా అక్కడికి సిబ్బందిని వేగంగా పంపించవచ్చు. అదే అప్పటికప్పుడు వీసా దరఖాస్తు చేసుకొంటే.. కొంత సమయం వృథా అవుతుంది. అలా వచ్చిన వ్యక్తికి కొత్త ఉద్యోగం దొరికి వెళ్లిపోగానే హెచ్‌1బీ వీసాలో యాజమాన్య మార్పిడి జరుగుతుంది. దీంతో కొత్త యజమాన్యం అతడికి సంబంధించిన ఇమ్మిగ్రేషన్‌ పని చూసుకొంటుంది.  
ఈ క్రమంలో క్లౌడ్‌జెన్‌ ఉద్యోగుల జీతాల్లో వాటాల రూపంలో 2013 నుంచి 2020 మధ్య 5,00,000 డాలర్ల వరకు పర్సంటేజీని వసూలు చేసినట్లు ఆరోపణలను ఎదుర్కొంది.   చీఫ్‌ జడ్జి లీ రోసెన్తల్‌ దీనిపై సెప్టెంబర్‌లో తీర్పులను వెలువరించనున్నారు. మిలియన్‌ డాలర్ల జరిమానా లేదా ఐదేళ్ల జైలు శిక్షను విధించే అవకాశం ఉంది.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని