కెనడాలో ప్రవాస తెలంగాణవాసుల ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో టొరంటో నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో దాదాపు 800 మందికి పైగా ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొన్నారు.

Updated : 28 Mar 2023 17:25 IST

టొరంటో: కెనడాలో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలు ఉగాది పండుగను ఉత్సహంగా జరుపుకొన్నారు. తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో టొరంటో నగరంలో 25 మార్చి 2023నాడు శ్రీ శోభకృత్ నామ సంవత్సర  ఉగాది వేడుకలు జరిగాయి. శృంగేరి విధ్యా భారతి ఫౌండేషన్‌ (SVBF) ఆడిటోరియంలో నిర్వహించిన ఈ వేడుకల్లో దాదాపు 800 మందికి పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. సంప్రదాయం ప్రకారం వేడుకలకు హాజరైన వారందరికీ ఉగాది పచ్చడి పంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాన్సుల్ జనరల్ అపూర్వ శ్రీ వాస్తవ (కాన్సులేట్‌ జనరల్ ఆఫ్ ఇండియా- టొరంటో) హాజరయ్యారు. తెలంగాణ కెనడా సంఘం అధికారిక తెలుగు పత్రిక TCA ఉగాది తొలి సంచికను ఆమె ఆవిష్కరించారు.  మాతృభాష ప్రాముఖ్యాన్ని తర్వాతి తరాల వారికి సైతం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పత్రిక ప్రాంభించినట్లు TCA అధ్యక్షులు శ్రీనివాస్‌ మన్నెం తెలిపారు. పత్రికావిష్కరణ అనంతరం ప్రముఖ పూజారి నరసింహచారి పంచాంగ శ్రవణం చేశారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిధులను ఆకట్టుకున్నాయి. సుమారు 92 మంది చిన్నారులు, పెద్దలు కలిసి 17 రకాల వినూత్న ప్రదర్శలతో మూడు గంటలపాటు అలరించారు. అనంతరం వేడుకలకు హాజరైన వారందరికీ రుచికరమైన విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ ఉగాది వేడుకల్లో TCA అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, కార్యదర్శి  శంతన్ నారెళ్ళపల్లి, సంయుక్త కార్యదర్శి రాజేష్ అర్ర, సాంస్కృతిక కార్యదర్శి  దీపా గజవాడ, కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ళ, సంయుక్త కోశాధికారి శ్రీ రాహుల్ బాలనేని, డైరెక్టర్లు - నాగేశ్వరరావు దలువాయి, ప్రవీణ్ కుమార్ శ్యామల, ప్రణీత్ పాలడుగు, శంకర్ భరద్వాజ పోపూరి, భగీరథ దాస్ అర్గుల,  యూత్ డైరెక్టర్ ధాత్రి అంబటి, ధర్మకర్తల మండలి  ఛైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు - ప్రసన్న మేకల, మాధురి చాతరాజు, వ్యవస్థాపక సభ్యులు - దేవేందర్ రెడ్డి గుజ్జుల, ప్రకాష్ చిట్యాల, అఖిలేష్ బెజ్జంకి, ప్రభాకర్ కంబాలపల్లి, శ్రీనివాస తిరునగరి, హరి రాహుల్, సంతోష్ గజవాడ, విజయ్ కుమార్ తిరుమలపురం, పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని