Hyderabad: లండన్‌లో హైదరాబాద్ యువతి హత్య.. చంపేసిన బ్రెజిల్ యువకుడు
లండన్‌లో హైదరాబాద్‌కు చెందిన యువతి హత్యకు గురైంది. తుర్కయాంజల్‌లోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన తేజస్విని రెడ్డి (27)పై బ్రెజిల్‌కు చెందిన యువకుడు కత్తితో దాడి చేసి చంపేశాడు.

హైదరాబాద్: లండన్‌లో హైదరాబాద్‌కు చెందిన యువతి హత్యకు గురైంది. తుర్కయాంజల్‌లోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన తేజస్విని రెడ్డి (27)పై బ్రెజిల్‌కు చెందిన యువకుడు కత్తితో దాడి చేసి చంపేశాడు. ఎంఎస్ చేసేందుకు లండన్ వెళ్లిన తేజస్విని.. బ్రెజిల్ యువకుడు, మరో ఇద్దరు స్నేహితులతో కలసి ఉంటోంది. ఈ క్రమంలో తేజస్వినితో పాటు ఆమె స్నేహితురాలిపై నిందితుడు దాడి చేశాడు.
ఈ ఘటనలో తేజస్విని చనిపోగా స్నేహితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు నెలల క్రితమే తేజస్విని ఎంఎస్ పూర్తిచేశారు. త్వరలో ఆమె స్వదేశానికి రావాల్సి ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తేజస్విని మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి రప్పించాలని కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: రాజమహేంద్రవరం చేరుకున్న కార్ల ర్యాలీ
-
Kishan Reddy: ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర: కిషన్‌రెడ్డి
-
iPhone 15: ఐఫోన్ 15 కొనబోతున్న ఎలాన్ మస్క్.. ఏం నచ్చిందో చెప్పిన బిలియనీర్!
-
China: చైనాలో జనాభా సంఖ్య కంటే ఖాళీ ఇళ్లే ఎక్కువ..!
-
Visakhapatnam: విరిగిపడిన కొండచరియలు.. కేకే లైన్లో ఏడు రైళ్ల నిలిపివేత
-
Pinarayi Vijayan: ‘అందుకే.. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు’