స్కాట్లాండ్‌లో తొలిసారిగా తెలుగు అష్టావధానం

స్కాట్లాండ్‌లో మొట్టమొదటి తెలుగు అష్టావధానం ఉత్సాహంగా జరిగింది. జులై 9న ఎడింబరో నగరంలోని హిందూ మందిర్‌లో ఏలూరుకు చెందిన శ్రీ ప్రణవ పీఠాధిపతి వద్దిపర్తి పద్మాకర్‌తో దీన్ని నిర్వహించారు. విజయ్‌కుమార్ రాజు పర్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

Updated : 14 Jul 2023 11:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్కాట్లాండ్‌లో మొట్టమొదటి తెలుగు అష్టావధానం ఉత్సాహంగా జరిగింది. జులై 9న ఎడింబరో నగరంలోని హిందూ మందిర్‌లో ఏలూరుకు చెందిన శ్రీ ప్రణవ పీఠాధిపతి వద్దిపర్తి పద్మాకర్‌తో దీన్ని నిర్వహించారు. విజయ్‌కుమార్ రాజు పర్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన స్కాట్లాండ్‌ తెలుగు సంఘం ఛైర్మన్‌ మైథిలి కెంబూరి జ్యోతి ప్రజ్వలన చేశారు. గాయకుడు కుమార్‌ అనీష్‌ కందాడ గణేశుని ప్రార్థనాగీతంతో అష్టావధానం అట్టహాసంగా ప్రారంభమైంది. పృచ్ఛకులను పల్లవి మంగళంపల్లి వేదికపై ఆహ్వానించారు.

అవధాని వద్దిపర్తి పద్మాకర్‌ తన అపారజ్ఞానంతో అన్ని అంశాలకు పద్యాలను అల్లిన తీరు పృచ్ఛకులకే కాకుండా చూపరులకు కూడా ఆనందం కలిగించిందని నిర్వాహకులు తెలిపారు. విశ్రాంత అధ్యాపకులు డా. అయ్యగారి జగన్నాథ కామేశ్వర ప్రసాద్ అవధాని ధారణాశక్తిని కొనియాడుతూ.. పృచ్ఛకుల కార్యదక్షతను ప్రశంసిస్తూ విమర్శనాత్మక విశ్లేషణ చేశారు. అనంతరం అవధాని వద్దిపర్తి పద్మాకర్ దంపతులను నిర్వాహకులు విజయ్, పృచ్ఛకులు ఘనంగా సత్కరించారు. ఆ తర్వాత 12 మంది పృచ్ఛకులను వద్దిపర్తి పద్మాకర్‌ చేతుల మీదుగా సన్మానించారు. పొరుగు నగరాల నుంచి వందలాది మంది తెలుగువారు ఎడింబరో వచ్చి ఈ అష్టావధానాన్ని ఆసక్తిగా తిలకించారు. 

సమస్యాపూరణం: నాగ ప్రసాద్ మంగళంపల్లి 

దత్తపది: రంజిత్ నాగుబండి 

వర్ణన: సాయికుమారి దొడ్డ 

నిషిద్ధాక్షరి: శైలజ గంటి 

న్యస్తాక్షరి: హిమబిందు జయంతి 

ఆశువు: అనంత రామానంద్ గార్లపాటి, మమత వుసికల

పురాణ పఠనం: విజయ్ కుమార్ రాజు పర్రి గారు, మిథిలేష్ వద్దిపర్తి, పండరి జైన్ కుమార్ పోలిశెట్టి

అప్రస్తుత ప్రసంగం: సత్య శ్యామ్‌కుమార్ జయంతి, నిరంజన్ నూక

ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహకారం అందించిన వారికి విజయ్‌కుమార్‌ రాజు పర్రి ధన్యవాదాలు తెలిపారు. స్కాట్లాండ్‌ తెలుగు సంఘం ఛైర్మన్‌ మైథిలి, బీఎస్‌ఎన్‌ఎల్‌ విశ్రాంత ఏజీఎం అయ్యగారి కోదండరావు, పృచ్ఛకులకు తోడ్పాటునందించిన తల్లాప్రగడ రామచంద్రరావు, హిందూమందిర్‌ యాజమాన్యం రాజశేఖర్‌ జాలాతో పాటు అష్టావధానం నిర్వహణకు సహాయపడిన స్నేహితులు, వాలంటీర్లకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం మంగళహారతితో శ్రీవిద్య కందాడ, రేఖ దుగ్యాల, రాజి చక్కగా ముగించారు. అదే రోజు సాయంత్రం 'శ్రీ కృష్ణ లీలలు’ అంశంపై భక్తి ప్రవచనాలు కార్యక్రమం అద్భుతంగా జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.  

సహాయకులు

రామచంద్ర దుగ్యాల 
కృష్ణ జుట్టాడ 
అశ్విన్ బక్కచెన్నగారి 
సంతోష్ శ్రీరామ
సంతోష్ తోట
సూర్య కిరణ్ 
ప్రదీప్ కందాడ 
రేవతి సదా 
లక్ష్మణ్ 
వరలక్ష్మి 
రమ్య 
శ్రీలక్ష్మి 
స్వాతి నాగుబండి 
శ్రీభార్గవి గునిశెట్టి

వాలంటీర్లు

కార్తీక్ బొర్ర
జాహ్నవి బొర్ర 
శివ జ్యోతి సంగం
యూనిస్ బైగ్ షేక్
బెంజమిన్ 
అస్మిత కట్టా
హరిణి రెడ్డి మంద
శ్రీ సాయి సుచిత్ రెడ్డి వీరవెల్లి
శ్రీమతి రీషిక వీరవెల్లి
సాయి కిరణ్
అక్షర షాహిరి
సాయికృష్ణ పారెకర్

అష్టావధానం కోసం క్లిక్‌ చేయండి

భక్తి ప్రవచనాల కోసం క్లిక్‌ చేయండి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు