కువైట్‌లో తెలుగు కళాసమితి నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

కువైట్‌లో తెలుగు ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఏర్పాటైన తెలుగు కళా సమితికి నూతన కార్యవర్గం ఎన్నికైంది.

Published : 31 May 2023 15:52 IST

కువైట్‌: కువైట్‌లో తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఏర్పాటైన తెలుగు కళాసమితి(TKS)కి నూతన కార్యవర్గం ఎన్నికైంది. 34 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన తెలుగు కళాసమితి (కువైట్‌) ఈ సంస్థ 2023-24 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కళాసమితి నూతన అధ్యక్షుడిగా పొత్తూరు పార్థసారథి, ఉపాధ్యక్షుడిగా డి.కృష్ణమరాజు, ప్రధాన కార్యదర్శిగా ముద్దా సుబ్బారావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా TKS నూతన అధ్యక్షుడు పార్థసారథి మాట్లాడుతూ.. నూతన కమిటీ తెలుగు సంస్కృతి, విలువలను నిలబెట్టే దిశగా పనిచేస్తోందని హామీ ఇచ్చారు. గత కమిటీల వారసత్వాన్ని కొనసాగిస్తూ మరింత ఉత్సాహంతో పనిచేస్తామన్నారు.

అనంతరం ఉపాధ్యక్షులు కృష్ణమరాజు మాట్లాడుతూ.. నూతన కమిటీ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కోశాధికారి అశ్విని కుమార్‌ నిమ్మగడ్డ తమను ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నూతన కమిటీ చేయబోయే కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, కళల్ని అభివృద్ధి చేయడం, పరిరక్షించడమే తెలుగు కళా సమితి- కువైట్‌ లక్ష్యమని సమితి సంయుక్త కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని