ఖతార్‌లో ఆంధ్ర కళా వేదిక ఆధ్వర్యంలో తెలుగు భాషాదినోత్సవాలు
వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆగస్టు 29న ఖతార్‌లో ‘తెలుగు భాషా దినోత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు........
ఖతార్: వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆగస్టు 29న ఖతార్‌లో ‘తెలుగు భాషా దినోత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు పలువురు తెలుగు భాషా ప్రముఖులు, అభిమానులు హాజరై మాతృభాష పట్ల తమకున్న అభిమానాన్ని, ప్రేమను పంచుకున్నారు. ఆంధ్ర కళా వేదిక అధ్యక్షుడు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ.. ఖతార్‌లో మొట్టమొదటిసారిగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడంతోపాటు ఉచితంగా తెలుగు భాషా తరగతులను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా చిన్నారులకు పద్యాలు, శ్లోకాలు, సామెతలు తదితర అంశాలపై పోటీలు నిర్వహించామని, విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేసినట్లు వెంకప్ప తెలిపారు. కాగా చిన్నారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోటీల నిర్వహణకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన తెలుగు ఉపాధ్యాయినులు రజితా రెడ్డి, సుధా చిత్తాప్రగడతో పాటు పిల్లల్ని ప్రోత్సహించిన సత్యనారాయణ మలిరెడ్డి, గొట్టిపాటి రమణ, ఇంద్రగంటి ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కార్యవర్గ సభ్యులు విక్రమ్ సుఖవాసి, కె.టి.రావు, సుధ(హోస్ట్), శిరీషా రామ్, రవీంద్ర, సాయి రమేశ్‌కు అభినందనలు తెలియజేశారు. ముగింపు సందేశంతో విక్రమ్ సుఖవాసి ఈ కార్యక్రమాన్ని ముగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
NEET : ‘నీట్’తో ప్రయోజనం శూన్యమని కేంద్రం అంగీకరించింది : స్టాలిన్
-
Chandrababu arrest: చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కాదు: కేంద్రమంత్రి గడ్కరీ
-
Kia Cars: కియా సెల్టోస్, కారెన్స్ ధరల పెంపు.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
-
Five Eyes Alliance: భారత్‌తో విభేదాలు.. ఆ ‘ఐదు కళ్ల’నే నమ్ముకొన్న ట్రూడో..!
-
Tamannaah: కొత్త పార్లమెంట్ భవనం వద్ద మెరిసిన తమన్నా.. ‘మహిళా బిల్లు’పై హర్షం
-
Singareni: సింగరేణి ఉద్యోగులకు 11వ వేజ్‌బోర్డు ఎరియర్స్ విడుదల