British High Commissioner: ఒక రోజు బ్రిటిష్‌ హైకమిషనర్‌ కావాలనుకుంటున్నారా?

ఒక రోజు బ్రిటిష్‌ హైకమిషనర్‌గా వ్యవహరించాలని అనుకుంటున్నారా? అయితే, అమ్మాయిలూ పోటీకి సిద్ధం కండి. ‘ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులతో వస్తున్న సవాళ్లను ఎదుర్కోవడంలో యువత ఎలా తోడ్పాటును అందిస్తుంది’ అనే

Updated : 14 Sep 2021 06:42 IST

అమ్మాయిలకు మాత్రమే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: ఒక రోజు బ్రిటిష్‌ హైకమిషనర్‌గా వ్యవహరించాలని అనుకుంటున్నారా? అయితే, అమ్మాయిలూ పోటీకి సిద్ధం కండి. ‘ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులతో వస్తున్న సవాళ్లను ఎదుర్కోవడంలో యువత ఎలా తోడ్పాటును అందిస్తుంది’ అనే అంశంపై 18నుంచి 23సంవత్సరాల యువతులకు పోటీలు నిర్వహించాలని భారత్‌లోని బ్రిటిష్‌ హైకమిషన్‌ నిర్ణయించింది. ఆ పోటీలో గెలుపొందిన యువతి బ్రిటిష్‌ హైకమిషనర్‌గా ఒక రోజు సేవలు అందించేలా అవకాశం కల్పించనున్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ పోటీని నిర్వహిస్తున్నట్లు హైకమిషనర్‌ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. పోటీలో పాల్గొనదలచిన అమ్మాయిలు వీడియోను ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌లో #DayoftheGirlను ఉపయోగించి@UKIndia కు ట్యాగ్‌ చేయాలి. తమ అభిప్రాయాన్ని వీడియో రూపంలో ఈ నెల 22లోగా పంపాలని భారత్‌లో బ్రిటిష్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ పేర్కొన్నారు. 2017 నుంచి ఈ పోటీలను నిర్వహిస్తున్నామని, గతేడాది 18సంవత్సరాల చైతన్యావెంకటేశ్వరన్‌ గెలుపొంది ఒక రోజు హైకమిషనర్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని