Joe Biden asleep: కాప్ సదస్సులో.. అమెరికా అధ్యక్షుడి కునుకు?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (78) మాత్రం కునుకు తీస్తున్నట్లు కనిపిస్తోన్న ఓ వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
వైరల్‌గా మారిన జో బైడెన్ వీడియో
గ్లాస్గో: వాతావరణ సంక్షోభానికి పరిష్కారాలు కనుగొనే లక్ష్యంతో ఒకే వేదికపైకి చేరిన ప్రపంచ దేశాలు.. అందుకు గల కార్యాచరణను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా సంపన్న దేశాలు ఎలాంటి హామీలు ఇస్తున్నాయనే విషయంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమయ్యింది. ఇలాంటి కీలక సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (78) మాత్రం కునుకు తీస్తున్నట్లు కనిపిస్తోన్న ఓ వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
గ్లాస్గో వేదికగా జరుగుతోన్న కాప్26 ఐరాస సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 120దేశాధినేతలు, అధ్యక్షులు పాల్గొన్నారు. ఒక్కో దేశం తాము చేపడుతోన్న కార్యక్రమాలు, చేయాల్సిన విషయాలపై అంతర్జాతీయ సమాజానికి వివరిస్తున్నాయి. ఈ సమయంలో ఆయా దేశాల ప్రతినిధుల ప్రసంగాలను వింటోన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మెల్లగా కునుకు తీస్తున్నట్లు ఉన్న ఓ వీడియో తాజాగా వైరల్‌గా మారింది. దాదాపు 20 సెకన్లపాటు అలా నిద్రలోకి జారుకున్నట్లు అందులో కనిపించింది. కొద్దిసేపటికి ఓ సహాయకుడు బైడెన్ దగ్గరికి వచ్చి పలుకరించడంతో తేరుకున్న ఆయన.. తిరిగి ప్రసంగాన్ని వినడం ప్రారంభించారు. అమెరికా వార్తాపత్రికకు చెందిన ఓ జర్నలిస్టు ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేయడంతో తాజాగా అది వైరల్‌గా మారింది. షేర్ చేసిన కొన్ని గంటలకే 46లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు.
డొనాల్డ్ ట్రంప్ విమర్శలు..
ఈ నవంబర్ 20తో 79ఏళ్ల వయసులోకి అడుగుపెడుతోన్న జో బైడెన్.. అమెరికా అధ్యక్షుల్లో అతి ఎక్కువ వయసున్న వ్యక్తిగా నిలిచారు. అయితే, ఈ వయసులో అధ్యక్షుడిగా సమర్థంగా విధులు నిర్వర్తించలేరని ఆయనపై ప్రత్యర్థులు విమర్శలు కూడా చేస్తుంటారు. ముఖ్యంగా గత అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో బైడెన్‌ను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘స్లీపీ జో’గానే అభివర్ణించారు. తాజాగా కాప్26 సదస్సులోనూ నిద్రపోతున్నట్లు కనిపించిన వీడియోపై స్పందించిన ట్రంప్.. బైడెన్ తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు. యూరప్‌కు వెళ్లి ఓపక్క గ్లోబల్ వార్మింగ్ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని చెప్పిన బైడెన్.. మరోవైపు నిద్రలోకి జారుకున్నారు. ఓ విషయంపై అత్యంత శ్రద్ధ ఉన్నవారు అలా నిద్రపోరు అంటూ బైడెన్‌పై డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Sharwanand: నేను క్షేమంగా ఉన్నా.. రోడ్డు ప్రమాదంపై శర్వానంద్ ట్వీట్
-
Movies News
The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’పై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India News
ఇది 140 కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిబింబం.. : కొత్త పార్లమెంట్లో ప్రధాని మోదీ
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
NTR 100th Birth Anniversary: రాజకీయాలు, సినీ జగత్తులో ఎన్టీఆర్ తనదైన ముద్రవేశారు: మోదీ
-
World News
USA: అమెరికాకు ఊరట.. అప్పుల పరిమితి పెంపుపై సూత్రప్రాయంగా ఒప్పందం