
Love Story: ‘లవ్‌స్టోరి’ క్రేజ్.. యూకేలోనూ విడుదల
లండన్: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్‌స్టోరి’. ఈ ప్రేమకథని సెప్టెంబరు 24న తెలుగు రాష్ట్రాలతోపాటు యూకేలోనూ విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రం ప్రదర్శితమయ్యే అక్కడి థియేటర్ల వివరాల్ని పంచుకుంది. సుమారు రెండేళ్ల తర్వాత యూకేలో విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రమిదేనని తెలిపింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. పవన్ సి.హెచ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.