ఇంజినీరింగ్‌ విద్యార్థినికి ఎన్నారై ఫౌండేషన్‌ చేయూత

కర్నూలు నగరానికి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థినికి ఎన్నారై ఫౌండేషన్‌ చేయూతగా నిలిచింది. కర్నూలు నగరంలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని

Published : 29 Oct 2021 20:55 IST

కర్నూలు: కర్నూలు నగరానికి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థినికి ఎన్నారై ఫౌండేషన్‌ చేయూతగా నిలిచింది. కర్నూలు నగరంలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సాయి సోమితకు తానా మాజీ కార్యదర్శి, ఎన్నారై ఫౌండేషన్‌ ఛైర్మన్‌ రవి పొట్లూరి రూ.20 వేల పారితోషికం అందించారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు కుటుంబసభ్యులని కోల్పోయి పలు ఇబ్బందులు పడుతున్నారని.. వారి కోసం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూతను అందిస్తున్నట్లు రవి పొట్లూరి తెలిపారు. దీనిలో భాగంగానే ఇంజినీరింగ్ చదువుతున్న సాయి సోమితకు పారితోషికం అందించినట్లు రవి వెల్లడించారు. ప్రతిభ గల విద్యార్థులకు ఆర్థిక చేయూతనివ్వడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి వెల్లడించారు. తానా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ, ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి, పారిశ్రామికవేత్త ముప్పా రాజశేఖర్, సుధాకర్ నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు