ఈనెల 25, 26 తేదీల్లో టొరంటోలో తెలుగు సాహితీ సదస్సు
టొరంటో: కెనడాలోని టొరంటోలో ఈనెల 25, 26 తేదీల్లో ‘మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు- 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు’ ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తెలుగు తల్లి పత్రిక, ఆటవా తెలుగు అసోసియేషన్, అంటారియో తెలుగు ఫౌండేషన్, టొరంటో తెలుగు టైమ్స్, కాల్గరి తెలంగాణ అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో, తెలుగు వాహిని సాహిత్య సమూహం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఈ ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశానికి ఏర్పాట్లు త్వరితగతిన జరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తమ ఆహ్వానాన్ని మన్నించి అమెరికా, కెనడాలో నివాసముంటున్న సుమారు 100 మంది తెలుగు సాహితీవేత్తలు ప్రసంగ ప్రతిపాదనలు పంపారని చెప్పారు. ఇది తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొంటూ ఆయా వక్తలకి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
టొరంటో ప్రధాన కేంద్రంగా ఈనెల 25, 26 తేదీల్లో జరిగే ఈ సదస్సు.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. అమెరికా, కెనడా దేశాల్లోని తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు ఇంత పెద్ద ఎత్తున సాహిత్యవేదికపై కలుసుకోవడం ఇదే తొలిసారి అని చెప్పారు. యూట్యూబ్ ద్వారా అందరూ వీక్షించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. 25న https://bit.ly/3zcq0O1 లింక్‌లో, 26న https://bit.ly/3mjgLYS లింక్‌లో సదస్సును వీక్షించవచ్చన్నారు.
సమగ్ర కార్యక్రమం, ప్రసంగాల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సదస్సు గురించి కెనడాలో ఉంటున్న తెలుగు యువతులు హర్ష దీపిక రాయవరపు, భావన పగిడేలా ప్రత్యేక వీడియోలో వివరించారు. ఈ కార్యక్రమం సంబంధించిన విషయాల కోసం సంచాలకులు లక్ష్మీరాయవరపు (sadassulu@gmail.com), హ్యూస్టన్‌కు చెందిన వంగూరి చిట్టెన్‌రాజు (vangurifoundation@gmail.com), సంధాన కర్తలు విక్రమ్ సింగరాజు (triv.sing@gmail.com), సాయి రాచకొండ (sairacha@gmail.com), కార్యనిర్వాహక సంఘం సభ్యులు యామిని పాపుదేశి, భావన పగిడేల, సర్దార్‌ఖాన్, కృష్ణ కుంకాలను సంప్రదించాలని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
75th Independence Day: ఎర్రకోట వేడుకల్లో.. అత్యాధునిక తుపాకులతో ‘గన్ సెల్యూట్’
-
World News
Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు
-
Sports News
Rohit sharma: ఈ ఫ్లాన్తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
-
Viral-videos News
Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
-
Movies News
Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
-
General News
Pancreatitis: కడుపులో నొప్పిగా ఉంటుందా..? ఇది ఎలా వస్తుందో తెలుసా..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్
- Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
- IIT Madrasలో రికార్డుస్థాయి ప్లేస్మెంట్లు..ఓ విద్యార్థికి ₹2కోట్ల వార్షిక వేతనం!
- UN: ఐరాస ఉగ్ర ఆంక్షల విధానాలపై మండిపడ్డ భారత్..!
- Rohit sharma: ఈ ఫ్లాన్తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
- Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు
- Thief: ‘నన్ను క్షమించు తల్లీ’.. దేవతను వేడుకొని మరీ హుండీ ఎత్తుకెళ్లిన దొంగ