విజయవంతమైన‘షిర్డీ సాయి గాయత్రి మహా మంత్ర జపం’

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి వల్ల నెలకొన్న చీకట్లను తరిమికొట్టేందుకు, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఈ నెల 17న కాలిఫోర్నియాలో అఖండ షిర్డీసాయి గాయత్రి మహా మంత్రజపం కార్యక్రమం జరిగింది.

Updated : 24 Dec 2021 12:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి వల్ల నెలకొన్న చీకట్లను తరిమికొట్టేందుకు, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఈ నెల 17న కాలిఫోర్నియాలో అఖండ షిర్డీసాయి గాయత్రి మహా మంత్ర జప కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సాయి ఉపాసకులు చేపట్టిన ‘కోటి సాయి గాయత్రి మంత్ర మహా జపం’ ఈ ఏడాది 1.21 కోట్ల మైలురాయిని చేరుకుంది. శ్రీ షిర్డీ సాయి మహారాజ్‌ దివ్య ఆశీస్సులతో గురు వాణియమ్మ ప్రేరణతో విశ్వసాయి ద్వారకామాయి శక్తిపీఠం ఆధ్వర్యంలో సాయి ఉపాసకులు, గురూజీ లక్ష్మోజీ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. ఆ రోజున నిరాటంకంగా సాయి మంత్రాన్ని జపించారు. ఇది విజయవంతం కావడంతో సక్సెస్ మీట్‌ను నిర్వహించనునున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సాయి గాయత్రీ దివ్య ఈవెంట్‌ సక్సెస్ మీట్ డిసెంబర్ 26వ తేదీ ఉదయం 11 గంటల(PST)కు జూమ్ వేదికగా జరగనుంది. అందరూ ఆహ్వానితులేనని వారు వెల్లడించారు.

విశ్వసాయి ద్వారకామాయి శక్తిపీఠం ఆధ్వర్యంలో ఇప్పటి వరకూ కోటి సాయి గాయత్రి మంత్ర మహా జపం.. 4.5 కోట్లు దాటగా.. రోటీ అన్నదాన కార్యక్రమం 1.28 లక్షలకు చేరిందని నిర్వాహకులు తెలిపారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts