Ukraine Crisis: రాజధాని కీవ్‌ వైపు ప్రయాణాలు చేయొద్దన్నారు: తెలుగు విద్యార్థిని లక్ష్మీ శ్రీలేఖ

అత్యవసరం అయితే తప్ప తమను బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారని ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థిని లక్ష్మీ శ్రీలేఖ తెలిపారు.

Published : 24 Feb 2022 13:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అత్యవసరం అయితే తప్ప తమను బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారని ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థిని లక్ష్మీ శ్రీలేఖ తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ‘ఈనాడు-ఈటీవీ’తో ఆమె మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలిపారు. తాము ఉన్న జబరేషియా ప్రాంతం ఈశాన్య ఉక్రెయిన్‌ కిందికి వస్తుందని.. అయితే ప్రస్తుతం ఇక్కడి పరిస్థితులు ఆందోళన చెందేంత స్థాయిలో లేవని చెప్పారు. రాజధాని కీవ్‌ వైపు మాత్రం ప్రయాణాలు చేయొద్దని.. జాగ్రత్తగా ఉండాలని చెప్పారని ఆమె వివరించారు. 10 రోజులకు సరిపడా నిత్యావసరాలను ఇంట్లో ఉంచుకోవాలని అధికారులు సూచించారన్నారు.

‘‘మా యూనివర్సిటీలో సుమారు 500 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఈనెల 25, 26 తేదీల్లో భారత్‌కు వచ్చే విమానాలు రద్దు అయ్యాయి. భారత రాయబార కార్యాలయ అధికారులు మాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విద్యార్థులందరినీ తరలిస్తామని చెప్పారు. బయటకు వెళ్లేటప్పుడు పాస్‌పోర్టు ఉంచుకోవాలని సూచించారు. తాత్కాలికంగా ఉక్రెయిన్‌ను వీడి రావాలని భారత ప్రభుత్వం చేసిన సూచన మేరకు చాలామంది స్వదేశానికి బయల్దేరుతున్నారు. మార్చి 10 వరకు ఉన్న టికెట్లన్నీ బుక్‌ అయిపోయాయి’’ అని లక్ష్మీ శ్రీలేఖ వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని