Singapore: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వైభవంగా బోనాల పండగ
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండగను వైభవంగా నిర్వహించారు.
సింగపూర్: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో జూలై 9న బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. అరసకేసరి శివన్ ఆలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో దాదాపు 500 మంది భక్తులు పాల్గొన్నారు. భక్తిగీతాలు, అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు, డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారి నామస్మరణలతో పరిసరాలు మార్మోగాయి. బోయిన స్వరూప, పెద్ది కవిత, కలకుంట్ల లావణ్య, వేముల సౌహన్య తదితర మహిళలు కుటుంబ సభ్యులతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. సింగపూర్‌లో నివసించే అనేక మంది వారి కుటుంబ సమేతంగా పాల్గొనగా, అనేకమంది కార్మిక సోదరులు కూడా చురుగ్గా పాల్గొన్నారు. మహిళలు తాము వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం కూడిన బోనాన్ని ముగ్గు , పసుపులతో అలంకరించిన కొత్త మట్టి కుండల్లో పెట్టారు. డప్పు వాయిద్యాల నడుమ పోతురాజులు వాళ్లను తోడ్కొని వెళ్లారు. మహిళలు, పిల్లలు అందరూ నృత్యాలు చేశారు. పోతురాజు వేషధారణ ఈ కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచింది.
సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాలు పండగ మన తెలుగు వారి సంప్రదాయానికి ప్రతీక అని, దీన్ని ప్రతీ సంవత్సరం జరపాలని తమ కార్యవర్గం నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యంగా తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. బోనాలు సమర్పించిన మహిళల్ని, కమిటీ సభ్యుల్ని, కార్యక్రమ నిర్వాహకులు బోయిన సమ్మయ్య అభినందించారు. కార్యక్రమం సజావుగా జరిగేలా చూసేందుకు తమ విలువైన సహకారాన్ని అందించిన సభ్యులందరికీ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. హాజరైన ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయమైన అనుభూతిని అందించడంలో వారి కృషి, అంకితభావం కీలక పాత్ర పోషించాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: అమీర్‌పేటలో చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ
-
Apply Now: ‘సింగిల్ గర్ల్ చైల్డ్’కు సీబీఎస్ఈ స్కాలర్షిప్.. దరఖాస్తు చేశారా?
-
Hyderabad: పాతబస్తీలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి గాయాలు
-
October 1: దేశవ్యాప్తంగా ‘శ్రమదాన్’.. స్వచ్ఛత కోసం మోదీ పిలుపు
-
Rakshit Shetty: తెలుగు ప్రేక్షకుల ఆదరణకు రక్షిత్ శెట్టి ఫిదా.. ఏమన్నారంటే?
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ