Canada: భారత సంతతికి చెందిన కెనడియన్లకు ఆ దేశఅత్యున్నత పౌర పురస్కారం!

ముగ్గురు భారత సంతతి కెనడా పౌరులకు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ వైకుంఠం అయ్యర్‌ లక్ష్మణన్‌, రియల్ ఎస్టేట్‌ వ్యాపారి బాబ్‌ సింగ్‌ దిల్లాన్‌ (నవ్‌జీత్‌ సింగ్‌ దిల్లాన్‌), పిల్లల వైద్యుడు డాక్టర్‌ ప్రదీప్‌ మర్చంట్‌ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ కెనడా’ అవార్డును అందుకున్నారు. సమాజానికి, దేశానికి

Published : 31 Dec 2021 01:35 IST

టోరంటో: ముగ్గురు భారత సంతతి కెనడా పౌరులకు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ వైకుంఠం అయ్యర్‌ లక్ష్మణన్‌, రియల్ ఎస్టేట్‌ వ్యాపారి బాబ్‌ సింగ్‌ దిల్లాన్‌ (నవ్‌జీత్‌ సింగ్‌ దిల్లాన్‌), పిల్లల వైద్యుడు డాక్టర్‌ ప్రదీప్‌ మర్చంట్‌ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ కెనడా’ అవార్డును అందుకున్నారు. సమాజానికి, దేశానికి విశేషంగా కృషి చేసిన వారికి ఈ అవార్డును కెనడా ప్రభుత్వం అందజేస్తుంటుంది. ఈ ఏడాది 135 మందికి ఈ పురస్కారానికి ఎంపిక చేయగా.. వారిలో ఈ ముగ్గురూ ఉన్నారు.

ఒంటారియోలోని మిస్సిసాగాకు చెందిన వైకుంఠం అయ్యర్‌ లక్ష్మణన్‌కు శాస్త్రవేత్తగా హైడ్రోమెటలర్జీలో ఉన్న నైపుణ్యం సమాజానికి ఎంతో ఉపయోగపడుతోంది. అలాగే, ఆయన వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయంలో కొంతమేర సమాజం శ్రేయస్సు కోసం విరాళంగా అందిస్తున్నారు. బాబ్‌ దిల్లాన్‌.. మెయిన్‌ స్ట్రీట్‌ ఈక్విటీ కార్పొరేషన్‌ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. టోరంటో స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్ట్‌ అయిన తొలి సిక్కులకు చెందిన కంపెనీ ఇదే కావడం విశేషం. అల్బర్టాకు చెందిన దిల్లాన్‌.. లాభాపేక్ష లేకుండా సమాజం కోసం తనవంతు సాయం చేస్తున్నారు. ఇక ఒంటారియోలోని గ్రీలీ ప్రాంతానికి చెందిన మర్చంట్‌.. పిల్లల వైద్యుడిగా వైద్య రంగంలో విశేషంగా కృషి చేయడంతోపాటు భారత్‌-కెనడా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఈ పురస్కారం అందించినట్లు కెనడా ప్రభుత్వం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని