Updated : 17 Jan 2021 22:16 IST

భారతీయులకు బైడెన్‌ పెద్దపీట!

శ్వేతసౌధ కీలక పదవుల్లో 20 మంది భారతీయ అమెరికన్లు

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం అయిన శ్వేతసౌధంలో భారత సంతతి వ్యక్తులు కీలక పాత్ర పోషించనున్నారు. కొత్తగా కొలువుదీరనున్న బైడెన్ యంత్రాంగంలో ఏకంగా 20 మంది భారతీయ అమెరికన్లు చోటు దక్కించుకున్నారు. వీరిలో 13 మంది మహిళలే కావడం విశేషం. ఆ దేశ జనాభాలో భారతీయ అమెరికన్ల వాటా ఒకశాతం కంటే తక్కువే. అయినా, అమెరికా వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఈ వర్గానికి బైడెన్‌ తన పాలక వర్గంలో పెద్దపీట వేశారు. అలాగే, తన యంత్రాంగంలో వివిధ మూలాలున్న వారికి అవకాశం కల్పించి అమెరికా చరిత్రలోనే అత్యంత వైవిధ్యం కలిగిన పాలకవర్గాన్ని సమకూర్చుకున్నారు. ప్రచార సమయంలోనే భారతీయ అమెరికన్లకు తన బృందంలో పెద్దపీట వేయనున్నట్లు బైడెన్‌ సంకేతాలిచ్చారు.

ఆ దేశ నూతన అధ్యక్షుడిగా బైడెన్‌ ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతి వ్యక్తి కమలా హారిస్‌ కూడా అదే రోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. అమెరికా చరిత్రలో తొలి మహిళా ఉపాధ్యక్షురాలు కావడమే కాకుండా.. ఆ పదవిని అలంకరించనున్న తొలి భారత సంతతి వ్యక్తి, ఏషియన్‌ అమెరికన్‌ కావడం విశేషం. ఇక హారిస్‌ తర్వాత బైడెన్‌ బృందంలో మరో కీలక పదవిని చేపట్టనున్న భారతీయ అమెరికన్‌ నీరా టాండన్‌. ఈమె ‘ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌’ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఇక మరో వ్యక్తి వివేక్‌ మూర్తి. ఈయన అమెరికా సర్జన్‌ జనరల్‌గా వ్యవహరించనున్నారు. వీరితో పాటు బైడెన్‌ పాలక వర్గంలో చోటు దక్కించుకున్న

మరికొంత మంది భారత సంతతి వ్యక్తులు వీరే...

వినయ్‌ రెడ్డి బైడెన్‌ స్పీచ్‌ రైటింగ్‌ బృందం డైరెక్టర్‌
వేదాంత్‌ పటేల్‌ అధ్యక్షుడికి అసిస్టెంట్‌ ప్రెస్‌ సెక్రటరీ
వనితా గుప్తా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ అసోసియేట్‌ అటార్నీ జనరల్‌
ఉజ్రా జెయా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌లో అండర్‌ సెక్రటరీ
మాలా అడిగా ప్రథమ మహిళకు పాలసీ డైరెక్టర్‌
గరిమా వర్మ ప్రథమ మహిళ కార్యాలయానికి డిజిటల్‌ డైరెక్టర్‌
సబ్రీనా సింగ్‌ ప్రథమ మహిళ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీ
ఐషా షా శ్వేతసౌధపు డిజిటల్‌ కార్యాలయంలో పార్టనర్‌షిప్‌ మేనేజర్‌
సమీరా ఫజిలి నేషనల్‌ ఎకనమిక్‌ కౌన్సిల్‌లో డిప్యూటీ డైరెక్టర్‌
భరత్‌ రామ్మూర్తి నేషనల్‌ ఎకనమిక్‌ కౌన్సిల్‌లో డిప్యూటీ డైరెక్టర్‌
గౌతమ్‌ రాఘవన్‌ డిప్యూటీ డైరెక్టర్‌, ఆఫీస్‌ ఆఫ్‌ ప్రెసిడెన్షియల్‌ పర్సనల్
తరుణ్‌ ఛబ్రా సీనియర్‌ డైరెక్టర్‌, టెక్నాలజీ అండ్‌ నేషనల్‌ సెక్యూరిటీ
సుమోనా గుహ సీనియర్‌ డైరెక్టర్‌, స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ సౌత్‌ ఏషియా విభాగం
శాంతి కలతిల్‌ విదేశాంగ విభాగంలో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం విభాగం సమన్వయ కర్త
సోనియా అగర్వాల్‌ సీనియర్‌ అడ్వైజర్‌, క్లైమేట్‌ పాలసీ
విదుర్‌ శర్మ పాలసీ అడ్వైజర్‌, కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల విభాగం
నేహా గుప్తా అసోసియేట్‌ కౌన్సిల్‌, శ్వేతసౌధం
రీమా షా డిప్యూటీ అసోసియేట్‌ కౌన్సిల్‌, శ్వేతసౌధం

ఇవీ చదవండి..

ఆందోళనలో అగ్రరాజ్యం!

బైడెన్‌ తొలి సంతకం వీటిపైనే..!

ఓడి... గెలిచాడు!


Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని