సందడిగా ‘టెన్నిన్సీ తెలుగు సమితి’ ఉగాది వేడుకలు

టెన్నెస్సీలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వందలాది మంది తెలుగు ప్రజలు ఒకే చోట చేరి ఉల్లాసంగా గడిపారు.

Published : 03 Apr 2023 20:16 IST

టెన్నిస్సీ: అమెరికాలోని టెన్నిస్సీ రాష్ట్రం నాష్‌విల్లీలో టెన్నిస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు వెయ్యి మందికి పైగా తెలుగు ప్రవాసులు పాల్గొని సందడి చేశారు. పిల్లలు, పెద్దలు అంతా సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో ఉల్లాసంగా గడిపారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా మేయర్‌ కెన్‌ మూర్‌ హాజరై తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను చూసి ఆనందించారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. మరీ ముఖ్యంగా సింగర్ కల్యాణ్ తన బృందంతో పాటు స్థానిక సింగర్లతో పాడిన పాటలు అందరినీ ఉర్రూతలూగించాయి. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన మేయర్‌.. ఈ కార్యక్రమం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతిని కలిగించిందన్నారు. ఈ వేడుకలకు తనను ఆహ్వానించినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా టెన్నిస్సీ తెలుగు సమితి అధ్యక్షుడు శ్యామ్ జేలం ప్రత్యేకంగా 29 ఏళ్లుగా ఈ సమితిని స్థాపించినప్పటి నుంచి పనిచేసిన పాత అధ్యక్షులనుందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారిని జ్ఞాపికలతో సత్కరించి గౌరవించారు. స్టార్టప్‌లు స్థాపించి వాణిజ్యరంగంలోకి వచ్చే వారిని ప్రోత్సహించేందుకు స్టాళ్లు ఏర్పాట్లు చేశారు. అలాగే, ఉగాది రెస్టారంట్‌వాళ్లు వచ్చిన అతిథులందరికీ విందు ఏర్పాటు చేశారు.   ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు నాష్‌విల్లీలో ఉన్న రెస్టారంట్స్‌, ఇతర బిజినెస్‌ల వారు తమ సహాయ సహకారాలు ఎప్పటిలాగే అందించారని నిర్వాహకులు అన్నారు. మరీ ముఖ్యంగా స్వాతి పోలేపల్లి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు విజయవంతం కావడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. శైలజ జాలెం స్టేజీని అందంగా ముస్తాబు చేసి తన వంతు సహకారం చేశారని నిర్వాహకులు తెలిపారు.

అలాగే, ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో మంజుల లిక్కి (సెక్రటరీ), వేణు ఆలోకం (కోశాధికారి),అనూరాధ, స్వాతి, దీప, శ్రీరంజని, శిల్ప, శిరీష, నిషిత, వంశీ, దినేష్, గణేష్ రావెళ్ల, మనోహర్, శ్రీకర్, రజనీకాంత్, శ్రీరాం తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  అలాగే, పూర్వపు తెలుగు సమితి అధ్యక్షులు చక్రధర రావు కొడాలి, రమేష్ ఆరమండ్ల, మధు పరుచూరి, ఆశ వల్లభనేని, ప్రసాద్ పోలవరపు, రాధ బాబు, సత్యనారాయణ వడ్లమూడి, మాధవి మల్లిపెద్ది, గరీష్ రాచకొండ, రాజేష్ నారాయణదాస్, దీప్తి రెడ్డి దొడ్లకు ప్రత్యేకంగా థాంక్స్‌ చెప్పారు.  వీరితో పాటు ఈ కార్యక్రమానికి కిషోర్ తుమ్మల (టెన్నిస్సీ తెలుగు సమితి వెబ్‌సైట్),హేమంత్ వీరమాచినెని (టెన్నిస్సీ తెలుగు సమితి డైరెక్టరి), నవీన్ (స్పొర్ట్స్),బాల,శివ,మహేంద్ర,వెంకట్ గడ్డం,ఉమ సప్పిడి,శ్రీనివాస్ కొనకళ్ళ, ప్రకాష్,క్రిష్ ఆలపాటి, నాగ పసుమర్తి, వీరు ముక్కు తమ వంతు సహాయ సహకారాలు అందించారని వీరందరికీ టెన్నిస్సీ తెలుగు సమితి తరఫున  శ్యామ్ జేలం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు