Ugadi: ఖతార్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఖతార్‌లోని దోహా నగరం పొడార్ పెర్ల్ స్కూల్ ఆడిటోరియంలో అక్కడి తెలుగు ప్రజలు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Updated : 30 Apr 2023 00:17 IST

దోహా: ఖతార్‌లోని దోహా నగరం పొడార్ పెర్ల్ స్కూల్ ఆడిటోరియంలో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో అక్కడి తెలుగు ప్రజలు శుక్రవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీ సంస్థల అధినేత వేగేశ్న వికలాంగుల బాలబాలికల ఆశ్రమ వ్యవస్థాపకుడు వంశీ రామరాజును ‘‘ కళా సేవా జీవిత సాఫల్య పురస్కారం’’ తో సన్మానించారు. ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయంలో రాజకీయ సమాచార వ్యవహారాల ప్రథమ కార్యదర్శి కర్రి పద్మ ముఖ్య అతిథిగా పాల్గొని రామరాజును సత్కరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు తాతాజీ ఉసిరికల రామరాజు సేవలను కొనియాడారు.  కార్యక్రమంలో ప్రవాస స్త్రీ శక్తి అవార్డ్ గ్రహీత డాక్టర్ రాజారామ పద్మజ, సంస్థ అధ్యక్షులు హరీష్ రెడ్డి దాసరపల్లి, ఇండియన్ స్పోర్ట్స్‌ కౌన్సిల్ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, ఐసీబీఎఫ్ ఉపాధ్యక్షుడు దీపక్ శెట్టి, ఐసీసీ కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ మలిరెడ్డి, వ్యవస్థాపక సభ్యులు కె.ఎస్.ప్రసాద్, ఇతర తెలుగు సంస్థల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, తెలుగు కళా సమితి పూర్వ, ప్రస్తుత కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా యువ గాయకులు సాయి చరణ్, శ్రీ లలిత ‘‘ స్వర తరంగం’’ సంగీత లహరి ఆకట్టుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని