యూఏఈలో ఉత్సాహంగా ఉగాది వేడుకలు

యూఏఈలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.

Published : 27 Mar 2023 23:05 IST

అబుదాబి: యుఏఈలో నివాసం ఉంటోన్న తెలుగు ప్రజలు ఉగాది పండుగను ఉత్సాహంగా జరుపుకొన్నారు. అబుదాబిలోని అల్ రహ్బా ఫామ్స్‌లో యుఏఈ పద్మశాలి ఫ్రెండ్స్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు  జరిగాయి. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలతో సందడిగా గడిపారు. ఈ వేడుకల్లో దాదాపు 150 మందికి పైగా పాల్గొన్నారు. సంప్రదాయం ప్రకారం హాజరైన వారందరికీ ఉగాది పచ్చడి పంచారు. ఈ కార్యక్రమంలో ఉగాది ప్రాముఖ్యతను, ఆ రోజు ప్రత్యేకంగా చేసే పచ్చడిలో పదార్థాలను గుర్తించేందుకు పిల్లలకు క్విజ్ పోటీలు పెట్టారు. హాసిని గుంటుక(14), ఉగాది ప్రాముఖ్యతను, ఉగాది పచ్చడిలోని ఆరు రుచులను అద్భుతంగా వివరించింది.  ఇది జీవితంలోని విభిన్న అనుభవాలకు ప్రతీక. రేవా మచ్చ (15) సంప్రదాయ కూచిపూడి నృత్యంతో అందరినీ అలరించింది.  ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు అలరించాయి.

సీనియర్ యుఏఈ ఇమ్మిగ్రేషన్ అధికారి కెప్టెన్ అల్ అమిరి ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అలాగే, తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించేందుకు సహకరించిన వాలంటీర్లందరికీ టీమ్‌ సభ్యుడు జగదీష్‌ గాలిపెల్లి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అఖిల పద్మశాలి సమాజ్‌ భివండి కోశాధికారి శ్రీ సాగర్‌ యెల్లెను యూఏఈ టీమ్‌ సత్కరించింది. వాలంటీర్‌ టీమ్‌లో యేముల శ్రీకాంత్‌, శ్రీనివాస్‌ గంజి, క్యాతాన్‌ లక్ష్మీనారాయణ, సందీప్‌ అనుమల్ల, అశోక్‌ గుంటుక, రాజేశ్‌ గడ్డం, సౌజన్య మామిడ్యాల, యోగి గంజిలి, రజిత తదితరులు ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు