London: ఘనంగా ‘యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ 7వ వార్షికోత్సవం

యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్‌ 29న లండన్‌లో హారో ప్రాంతంలోని హచ్‌ ఎండ్‌ హైస్కూల్‌లో ఘనంగా నిర్వహించారు.

Updated : 07 Jul 2024 02:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్‌ 29న లండన్‌లో హారో ప్రాంతంలోని హచ్‌ ఎండ్‌ హైస్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. తెలుగు, హిందూ సమాజ సాంస్కృతిక, వారసత్వ విలువలను పరిరక్షించడం, ఐక్యతను పెంపొందించేందుకు 2017 జూన్‌లో ‘యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ స్థాపించారు. యూకేలో నివసిస్తున్న తెలుగు, హిందూ కుటుంబాలను ఏకం చేయాలనేది ఈ సంస్థ ప్రాథమిక లక్ష్యం. వేడుకల్లో భాగంగా 6 బృందాలు రామాయణంలోని సన్నివేశాలపై స్కిట్‌లు ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాలబాలికలు రామాయణంలోని పలు పాత్రల గురించి మాట్లాడారు. ముఖ్యమైన పాత్రల నుంచి వారు ఎలాంటి మంచిని నేర్చుకుంటున్నారో వివరించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని