Visa interview: వీసాదారులకు గుడ్‌న్యూస్.. మరో ఏడాది పాటు ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు
భారత్ నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థులు, వృత్తి నిపుణులకు ఊరట కల్పించేలా వీసా దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ విషయంలో ఇస్తున్న మినహాయింపును అమెరికా ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
వాషింగ్టన్: విద్యార్థులు, వృత్తి నిపుణులకు ఊరట కల్పిస్తూ అమెరికా (US) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీసా (visa) దరఖాస్తుదారులకు కొన్ని వలసేతర వీసా కేటగిరీల్లో ఇంటర్వ్యూ (Visa interview) విషయంలో ఇస్తున్న మినహాయింపును పొడిగించింది. 2022 ఏడాది మొత్తానికి ఈ నిర్ణయం వర్తించేలా ఇప్పటికే ఓసారి నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు దాన్ని 2023 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్తగా లేదా పునరుద్ధరణ వీసా దరఖాస్తుల్లో ఎవరిని ఇంటర్వ్యూలకు పిలవాలనేది నిర్ణయించే అధికారాన్ని కాన్సులర్ అధికారులకు అప్పగించినట్లు తెలిపింది. విదేశీ విద్యార్థులు, తాత్కాలిక వర్కర్లు అమెరికాకు రావడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న మేలును గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తాజా నిర్ణయం వల్ల భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వృత్తినిపుణులు, విద్యార్థులకు మేలు జరగనుంది.
అమెరికాలో ఏ వీసా జారీకైనా వ్యక్తిగత ఇంటర్వ్యూ తప్పనిసరి. అందులో ఎంపికైతేనే వీసా మంజూరవుతుంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూ విధానాన్ని పక్కనపెట్టిన అమెరికా.. చైనా సహా పలు దేశాల్లో మరోసారి కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ విధానాన్ని మరోసారి పొడిగించింది. ఇంటర్వ్యూ మినహాయింపు వల్ల వీసా వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా తగ్గిందని ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా కొన్ని కేసుల్లో వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించే అధికారం రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ అధికారులకు ఉందని స్పష్టం చేసింది.
అమెరికా పేర్కొన్న వీసా కేటగిరీల్లో తాత్కాలిక అగ్రికల్చరల్ అండ్ నాన్ అగ్రికల్చరల్ వర్కర్స్ (H-2 వీసాలు), విద్యార్థులు (F, M వీసాలు), అకడమిక్ ఎక్స్ఛేంజీ విజిటర్స్ (అకడమిక్ J వీసాలు), ప్రత్యేక వృత్తినిపుణులు (H-1B), శిక్షణ, ప్రత్యేక విద్య సందర్శకులు (H3), ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ అయ్యేవారు (L), విశేష ప్రతిభావంతులు (O), క్రీడాకారులు, కళాకారులు, వినోదరంగం వారు (P), అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు (Q వీసాలు) ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు పొందొచ్చు. వీరితో పాటు ఇప్పటికే ఒకసారి వీసా పొంది దాని కాలపరిమితి ముగిసే 48 నెలల్లోగా పునరుద్ధరించుకోవాలని భావించే వారూ వ్యక్తిగత ఇంటర్వ్యూల హాజరు నుంచి మినహాయింపునకు అర్హులని స్పష్టంచేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
General News
Srisailam: శ్రీశైలం ఘాట్రోడ్లో రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Chiranjeevi: జన్మజన్మలకు నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాం..: చిరంజీవి
-
India News
PM Modi: బడ్జెట్ సమావేశాల వేళ.. మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ
-
General News
TelangaNews: ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్ఎల్పీఆర్బీ కీలక నిర్ణయం