Updated : 18/05/2021 14:09 IST

Corona: భారత్‌కు సాయం కొనసాగిస్తాం

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారిపై చేస్తున్న పోరాటంలో భారత్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటామని అగ్రరాజ్యం అమెరికా మరోసారి హామీ ఇచ్చింది. తమ కీలక భాగస్వామికి అన్ని విధాల సహాయసహకారాలు కొనసాగిస్తామని శ్వేతసౌధం ప్రకటించింది. కొవిడ్‌ పోరులో భాగంగా భారత్‌కు అమెరికా ఇప్పటికే 100 మిలియన్‌ డాలర్ల విలువైన సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన కార్యక్రమాలను అధ్యక్షుడు జో బైడెన్‌ దగ్గరుండి చూసుకుంటున్నారని వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి జెన్‌ సాకీ తెలిపారు. 

‘‘ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ పరిస్థితులను అధ్యక్షుడు జో బైడెన్‌ పరిశీలిస్తున్నారు. మా కీలక భాగస్వామి అయిన భారత్‌కు మేం చేయగలిగిన సాయం చేస్తున్నాం. ఆ సహాయ సహకారాలను అధ్యక్షుడు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ విపత్కర సమయంలో భారత్‌కు అన్ని విధాల అండగా ఉంటూ సాయం కొనసాగిస్తాం. ఆ దేశానికి ఏం అవసరముందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. భారత్‌లో కొవిడ్‌ కేసులు, మరణాలు తగ్గడంలో, అక్కడి ప్రజలకు మహమ్మారి నుంచి ఉపశమనం కల్గించడంలో మేం నిర్మాణాత్మక పాత్ర పోషించగలమని విశ్వసిస్తున్నాం’’ అని జెన్‌ సాకీ తెలిపారు. కొవిడ్‌తో సతమతమవుతున్న భారత్‌కు సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అమెరికా, యూకే సహా పలు దేశాలు ఇప్పటికే ఆక్సిజన్‌ ప్లాంట్లు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, ఇతర వైద్య సహాయం అందిస్తున్నాయి.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని