Updated : 24/03/2021 18:28 IST

యూఎస్ సర్జన్‌ జనరల్గా వివేక్‌ మూర్తి

వాషింగ్టన్‌: ప్రవాస భారతీయ వైద్యుడు వివేక్‌ మూర్తి అమెరికా సర్జన్‌ జనరల్‌గా మరోసారి నియమితులయ్యారు. డాక్టర్‌ వివేక్‌ మూర్తి నియామకాన్ని 57-43 ఓట్లతో అమెరికన్‌ సెనేట్‌ ఆమోదించింది. 43 ఏళ్ల వివేక్‌ మూర్తి అమెరికా సర్జన్‌ జనరల్ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. ఒబామా ప్రభుత్వ హయాంలోనూ యూఎస్‌ సర్జన్‌ జనరల్‌గా ఆయన పనిచేశారు. 37 ఏళ్ల వయసులోనే సర్జన్‌ జనరల్‌గా నియమితులైన వివేక్‌ మూర్తి.. చిన్న వయసులోనే ఆ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత ట్రంప్‌ హయాంలో మూర్తి ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. 

రెండోసారి యూఎస్‌ సర్జన్‌ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన వివేక్‌ మూర్తి ఆనందం వ్యక్తం చేశారు. ‘నాపై నమ్మకముంచి నాకు సర్జన్‌ జనరల్‌ బాధ్యతలు అప్పగించినందుకు సెనేట్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. కరోనా కారణంగా ఏడాది కాలంగా తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. కఠిన పరిస్థితుల నుంచి దేశాన్ని కోలుకునేలా చేసి.. పౌరుల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ఎదురుచూస్తున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు.


Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని