Published : 22 May 2021 21:41 IST

సింగపూర్‌లో వైభవంగా వాసవి జయంతి వేడుకలు

సింగపూర్‌లో నివసిస్తున్న ఆర్యవైశ్యులు వాసవి క్లబ్ సింగపూర్ వారి ఆధ్వర్యంలో వాసవి మాత జయంతిని ఘనంగా నిర్వహించారు. కొవిడ్ నిబంధనల కారణంగా వర్చువల్ పద్ధతిలో జూమ్ కాల్ ద్వారా ఈ వేడుకలు జరిగాయి. కామారెడ్డి జిల్లాలో సిద్ది వినాయక ఆలయ పురోహితులైన ఆంజనేయశర్మ నివాసంలో ప్రత్యేక అలంకరణతో అమ్మవారి మంటపాన్ని అలంకరించారు. అనంతరం భక్తులతో గణపతి పూజ, ఆదిత్యహృదయం, చంద్రశేఖరాష్టకం, వాసవి కుంకుమార్చన, అమ్మవారి జన్మవృత్తాంత వర్ణనతో ఆహూతులను భక్తి శ్రద్ధలతో వ్రతమాచరింపజేశారు. అదే సమయంలో సింగపూర్‌లోని మారియమ్మన్ ఆలయంలో కూడా అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మహిళలు, పిల్లలు అమ్మవారి మణిదీప వర్ణన, అమ్మవారి భక్తిగీతాలాపనలతో కార్యక్రమాన్ని కొనసాగించారు.

ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ పూర్వ అధ్యక్షులు, పెనుగొండ వాసవి నిత్యాన్నదాన ట్రస్ట్ అధ్యక్షులు నూలి వెంకట రమణ మూర్తి సభ్యులందరికి అమ్మవారు చెప్పిన ధర్మ సూత్రములను చక్కగా వివరించి అందరిలో గొప్ప స్ఫూర్తిని నింపారు. చివరిగా క్లబ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ గొట్లూరు మాట్లాడుతూ కార్యక్రమం చక్కగా జరిగేందుకు సహకరించిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి మాట్లాడుతూ కొవిడ్ సమయంలో పేద ఆర్యవైశ్యులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో కమిటీ సభ్యులైన కిషోర్ ముక్కా, ముకేశ్ భూపతి, మురళి కృష్ణ పబ్బతి, రాజా విశ్వనాథుల తదితరులు పాల్గొన్నారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని