NRI: తెదేపా-జనసేన-భాజపా కూటమి ఘనవిజయం.. నార్త్‌ కరోలినాలో భారీ ర్యాలీతో సంబరాలు

చరిత్ర తిరగ రాసిన విజయంతో సంబరాలు  ప్రతి ఒక్కరికీ కూటమి పిలుపు నందివ్వగా.. విజయోత్సవ వేడుకలకి అశేష జన సందోహం కదలి వచ్చింది.

Updated : 16 Jun 2024 10:39 IST

ఇంటర్నెట్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా  కూటమి అద్భుత విజయం సాధించిన సందర్భంగా NRI TDP Raleigh, నార్త్‌ కరోలినా ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. సుమారు 100 కార్లు, బైకులతో ర్యాలీగా జయ జయ ధ్వనులతో నందమూరి తారక రామారావు గారి సువర్ణ వర్ణ విగ్రహంతో సభా ప్రాంగణానికి ఊరేగింపుగా తీసుకొని వచ్చి ప్రతిష్ఠించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి దీపారాధన చేసి.. ప్రసాద్ కొమ్మరాజు ప్రార్థనా గీతాలతో సభను కనులపండువగా ప్రారంభించారు. 

ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్‌ గొట్టిపాటి శ్రీధర్, Raleigh NRI TDP (టీడీపీ) కమిటీ సభ్యులు శ్రీ ఆరెమండ శ్రీనివాస్, మాధవి ముప్పవరపు, రాజీవ్ తలసీల, నాగరాజు గొంది, శ్రీనివాస్ మురారిశెట్టి, శ్రీనాథ్ కడియాల, సురేష్ చలపాలి, ఎన్టీఆర్‌ ఫౌండేషన్‌ యూఎస్‌ఏ ట్రెజరర్‌ పూర్ణచంద్ర కొండ్రగుంట, కొండపనేని, శ్రీకాంత్ యర్రగుంట, హరీష్ కన్నెగంటి, శ్రీనివాస్ మార్తాల, శరత్ కమ్మినేని, రావు ముక్కామల, భాజపా నాయకులు డా. అడుసుమల్లి శంకర్, రాజ్ కూరపాటి, జనసేన (JSP) నాయకులు కృష్ణరెడ్డి గంగిరెడ్డి, నారాయణ్ చింతపట్ల, సన్నీ బత్తుల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలో ఇంత చక్కని కార్యక్రమాన్ని సంకల్పించి, విజయవంతంగా నిర్వహించడంలో తెదేపా నాయకులు ఎంతో కృషి చేశారు. ఈ విజయోత్సవ సభలో జూమ్‌ మాధ్యమం ద్వారా కేంద్ర మంత్రి డా. చంద్ర శేఖర్ పెమ్మసాని నిర్వాహకులను అభినందించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారై పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. పూర్ణచంద్ర కొండ్రగుంట వందన సమర్పణతో విజయోత్సవ కార్యక్రమం ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని