డార్ట్‌ఫోర్డ్ నగరంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
కెంట్‌లోని డార్ట్‌ఫోర్డ్ నగరంలో 'ఫీనిక్స్ క్వార్టర్స్ రెసిడెంట్స్ కమ్యూనిటీ' ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. దాదాపు 150 మంది ప్రవాస భారతీయులు......
లండన్: కెంట్‌లోని డార్ట్‌ఫోర్డ్ నగరంలో 'ఫీనిక్స్ క్వార్టర్స్ రెసిడెంట్స్ కమ్యూనిటీ' ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. దాదాపు 150 మంది ప్రవాస భారతీయులు ఈ వేడుకలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామూహిక మంగళ హారతులతో వినాయక మంత్రాలు జపించి, పాటలు ఆలపించి మూడు రోజుల పాటు (సెప్టెంబర్ 10 నుంచి 12వరకు) ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలను జరుపుకొన్నారు. భక్తులంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయకుడిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. అనంతరం భారతీయ, తెలుగు వంటకాలతో విందు, ప్రసాదం పంపిణీ చేశారు. ఈ ఏర్పాట్లు చేసిన మహిళలకు నిర్వాహకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ వేడుకలకు డార్ట్‌ఫోర్డ్ టౌన్ కౌన్సిలర్లు క్రిస్ షిప్పం, రిచర్డ్ వెల్స్, బ్రెంట్ కౌన్సిలర్ అవతార్ సంధు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
చివరి రోజున భక్తులంతా 'గణపతి బప్పా మోరియా' అంటూ నినాదాలు చేస్తూ నిమజ్జనోత్సవం వైభవంగా నిర్వహించారు. కారుపై గణపతి విగ్రహాన్ని ఊరేగించి నిమజ్జనం చేశారు. ఈ వేడుకను భారతీయ పద్ధతుల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నట్టు డార్ట్ ఫోర్డ్ ఫీనిక్స్ క్వార్టర్స్ రెసిడెంట్స్ కమ్యూనిటీ వాలంటీర్ కృష్ణ పవన్ చల్లా ఓ ప్రకటనలో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Social Look: ఫ్యాషన్ షోలో ఖుషి.. దివి స్టైలిష్ అవతార్
-
stuntman sri badri: ‘భోళా శంకర్’ మూవీ పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Cheetah : భారత్‌కు ఉత్తర ఆఫ్రికా దేశాల చీతాలు.. పరిశీలిస్తున్న అధికారులు!
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!