మోరిస్‌విల్లేలో ఘనంగా వినాయక చవితి వేడుకలు..

స్వచ్ఛంద సంస్థలకు రూ.30 లక్షల సాయం...

Updated : 21 Sep 2021 15:14 IST

స్వచ్ఛంద సంస్థలకు రూ.30 లక్షల సాయం

మోరిస్‌విల్లే : నార్త్‌ కరోలినాలోని మోరిస్‌విల్లేలో వినాయక చవితి ఉత్సవాలను ప్రవాసులు ఘనంగా నిర్వహించారు. ‘ఆర్జిన్‌ హబ్స్‌’ ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలు జరిగాయి. వేడుకల్లో భాగంగా ఆర్జిన్‌ హబ్స్‌ ఉద్యోగులు, కుటుంబసభ్యులు ప్రతి రోజు గణపతి హోమం, కుంకుమ పూజ నిర్వహించారు. ఉత్సవాల్లో చివరి రోజున ఉట్టి కొట్టే కార్యక్రమం, లడ్డూ వేలంపాట ఆసక్తిగా సాగాయి. ఇది ఆధ్యాత్మిక, భక్తి భావంతో కూడిన కార్యక్రమంలానే కాకుండా.. ఇందులో పాల్గొన్న వారందరూ స్వచ్ఛంద సంస్థల సాయం కోసం నడుం బిగించారు. విరాళాల రూపంలో దాదాపు రూ.30 లక్షలను సమకూర్చారు. ఈ మొత్తాన్ని బాలికల విద్య, పిల్లల సంక్షేమం, ఇతర సేవా కార్యక్రమాల కోసం కృషి చేసే స్వచ్ఛంద సంస్థలకు అందించనున్నట్లు ‘ఆర్జిన్‌ హబ్స్‌’ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని