yarlagadda lakshmi prasad : అమెరికాలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ ఎన్నికల ప్రచారం

అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో పద్మ భూషణ్ పురస్కార గ్రహీత డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 18 Aug 2023 21:45 IST

వాషింగ్టన్‌ డీసీ : అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో పద్మ భూషణ్ పురస్కార గ్రహీత డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమెరికా రాజకీయాల్లో ప్రవాసాంధ్రులు క్రియాశీలకంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. నోవై నగర కార్పొరేషన్‌ ఎన్నికల్లో కృష్ణా జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడు పెద్దిబోయిన జోగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నోవై ప్రస్తుత, మాజీ మేయర్లతో ప్రచారం నిర్వహించిన యార్లగడ్డ జోగేశ్వరరావుకు తన మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ అమెరికా పౌరసత్వం కలిగిన ప్రవాస భారతీయులు మాతృదేశ రాజకీయాల్లో తామరాకుపై నీటి బిందువుల్లా వ్యవహరించాలని సూచించారు. స్థానిక రాజకీయాల్లో, సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని కోరారు. తాను ఏ దేశానికి వెళ్లినా ఇలాగే ప్రవాసులను ప్రోత్సహిస్తానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న జోగేశ్వరరావుకు నోవైలో భారతీయులతో సత్సంబంధాలు ఉన్నాయని, ఆయన కచ్చితంగా విజయం సాధిస్తారని లక్ష్మీప్రసాద్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జోగేశ్వరరావు ఎన్నికల ఖర్చుల నిమిత్తం యార్లగడ్డ కుటుంబీకులు 3375 డాలర్లు విరాళం అందజేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు