డాలస్‌లో ఉత్సాహంగా యోగా శిక్షణ కార్యక్రమం
మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో అమెరికాలోని డాలస్‌లో నెలకొని ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (జూన్ 21) పురస్కరించుకుని ప్రవాస భారతీయులు యోగా శిక్షణా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
డాలస్, టెక్సాస్: మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో అమెరికాలోని డాలస్‌లో నెలకొని ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (జూన్ 21) పురస్కరించుకుని ప్రవాస భారతీయులు యోగా శిక్షణా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సుల్ జనరల్ అసీం మహాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డా.ప్రసాద్ తోటకూర ఆయను ఘన స్వాగతం పలికారు. భారత దేశం ప్రపంచానికి అందించిన యోగా కేవలం జూన్ 21నే గాక, నిత్యం అభ్యాసం చెయ్యవలసిన కార్యక్రమమని, యోగా చేయడం వల్ల శరీరం, మనస్సు స్వాధీనంలో ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ డా.ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలిపారు.
ఇండియన్ కాన్సుల్ జనరల్ అసీం మహాజన్ మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా విశ్వవ్యాప్తంగా జూన్ 21న యోగా కార్యక్రమం జరపడం ఎంతో సంతోషదాయకమన్నారు. ప్రతి రోజూ యోగా చెయ్యడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఒనగూరుతాయన్నారు. ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ ఉత్తరాధ్యక్షుడు దినేష్ హూడా, బోర్డు సభ్యులు రాజీవ్ కామత్, షబ్నం మోడ్గిల్, పలు సంస్థల సభ్యులు, ప్రవాస భారతీయులు, చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యడంలో సహాయపడిన కార్యకర్తలకు, యోగా శిక్షణ ఇచ్చిన యోగా మాస్టర్ విజయ్, ఐరిస్, ఆనందీలకు, ముఖ్య అతిథి కాన్సల్ జనరల్ అసీం మహాజన్‌కు, మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యుడు దినేష్ హూడా కృతజ్ఞతలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social look: ఐఫాలో తారల తళుకులు.. అందాలతో ఇన్‌స్టాలో మెరుపులు
-
Politics News
Kishan reddy: మా వ్యూహం ఎన్నికల సమయంలో చూపిస్తాం: కిషన్‌రెడ్డి
-
General News
Telangana News: హౌస్ సర్జన్లు, పీజీలు, సీనియర్ రెసిడెంట్లకు శుభవార్త
-
Sports News
IPL 2023 Final: ఐపీఎల్ టైటిల్ విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
-
Viral-videos News
Viral Video:గగనతలంలో అధ్యక్షుడి విమానం డేంజరస్ స్టంట్..!
-
India News
దేశ విభజన కారకులకు సిలబస్‌లో స్థానం ఉండకూడదు: డీయూ