రైతుల ఆందోళన: ఆ కవి చెప్పింది నిజమే

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నెల రోజులకు పైగా రైతులు ఆందోళన చేస్తోన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత చిదంబరం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Published : 04 Jan 2021 16:13 IST

ప్రభుత్వాన్ని హెచ్చరించిన కాంగ్రెస్‌ నేత

దిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నెల రోజులకు పైగా రైతులు ఆందోళన చేస్తోన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత చిదంబరం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాము మోసపోతున్నామని నమ్ముతున్న రైతుల కోపాన్ని ప్రభుత్వం తట్టుకోలేదని హెచ్చరించారు. ఈ క్రమంలో ఆయన సోమవారం ట్విటర్ వేదికగా తిరువళ్లువర్  బోధనలను ప్రస్తావించారు.

‘రైతులు చేతులు ముడుచుకొని కూర్చుంటే..జీవితాన్ని త్యజించిన వ్యక్తి కూడా మనుగడ సాగించలేడు. ఈ విషయాన్ని 2,000 వేల సంవత్సరాల క్రితం నా అభిమాన కవి తిరువళ్లువర్ తన రచనల్లో వెల్లడించారు. ఈ రోజు అది నిజమని తెలుస్తుంది. తాము మోసపోతున్నామని నమ్మిన రైతుల కోపాన్ని ఏ ప్రభుత్వమూ తట్టుకోలేదు’ అని చిదంబరం ట్వీట్ చేశారు. 

కాగా, వ్యవసాయ చట్టాలపై కేంద్రం, రైతు సంఘాల మధ్య నెల రోజులకు పైగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ రోజు ఇరువర్గాల మధ్య ఏడో విడత చర్చలు జరుగుతున్నాయి. చట్టాల రద్దుతో పాటు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరకపోతే గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీ చేపడతామని, ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఇప్పటికే రైతన్నలు హెచ్చరించారు. 

ఇవీ చదవండి:

కేంద్రం..రైతు సంఘాల చర్చలు ప్రారంభం

రైతుల నిరసన..రిలయన్స్ ప్రకటన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని