Paper leak: పేపర్‌ లీక్‌లతో యువత కలల్ని నాశనం చేసినోళ్లను వదిలేది లేదు.. సీఎం భజన్‌లాల్‌ శర్మ

రాష్ట్రంలో పలు ఉద్యోగ నియామక పరీక్షల పేపర్‌లీకేజీలతో యువత ఆశల్ని నాశనం చేసినవాళ్లను వదిలేది లేదని సీఎం భజన్‌లాల్‌ శర్మ హెచ్చరించారు.

Published : 08 Jul 2024 00:07 IST

Paper leak incidents| జైపుర్‌: గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాజస్థాన్‌లో 19 ఉద్యోగ నియామక పరీక్షలకు 17 పేపర్లు లీక్‌ అయ్యాయని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ (Bhajan Lal sharma) అన్నారు. పేపర్‌ లీకేజీల ద్వారా యువతను తీవ్ర నిరాశ నిస్పృహల్లోకి నెట్టివేశారని మండిపడ్డారు. భాజపా ప్రభుత్వం ఏర్పాటు కాగానే.. ఈ ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఇప్పటివరకు 108మంది నిందితుల్ని అరెస్టు చేసినట్లు సీఎం వెల్లడించారు.  రాజ్‌పురోహిత్‌ గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో 19 పరీక్షలకు గాను 17 పేపర్లు లీక్ అయ్యాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం యువతను నిరాశా నిస్పృహల్లోకి నెట్టింది.  పేపర్ లీక్ ఘటనలతో కష్టపడి చదివిన, నిజాయితీ కలిగిన విద్యార్థుల మనోధైర్యం దెబ్బతింది. ఈ కేసులో 108 మందిని అరెస్టు చేశాం. వీరంతా యువత కలల్ని ఛిన్నాభిన్నం చేశారు. యువత ఆశలపై నీళ్లు చల్లిన వారిని వదిలిపెట్టబోం. ఈ ఏడాది దాదాపు 70వేల ఉద్యోగాల నియామకాలు జరుగుతున్నాయి. ప్రైవేటు రంగంలోనూ యువత ఉపాధిపొందేలా మార్గదర్శనం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని డివిజన్లలో యువసాథి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం’’ అ న్నారు. 

‘పిల్లాడిలా ఎన్నిసార్లు ఏడుస్తారు’ - ఉద్ధవ్‌పై మండిపడ్డ శిందే!

గత ఐదేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల కోసం ఏమీ చేయలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, చిత్తోడ్‌గఢ్‌ ఎంపీ జోషీ విమర్శించారు.  ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఏదోఒకటి చేస్తున్నామనే భ్రమ కల్పించేందుకు ప్రజల్ని క్యూలో నిలబెట్టి ఏదో ఇస్తున్నామనే భావన కల్గించారని ఆరోపించారు. భాజపా ప్రభుత్వం ఏర్పాటు కాగానే సీఎం భజన్‌లాల్‌ అనేక ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని