Published : 08 Dec 2020 02:17 IST

భారత్‌ బంద్‌కు 24 పార్టీల మద్దతు

దిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తలపెట్టిన భారత్‌ బంద్‌కు 24 రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, జేఎంఎం, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన, శిరోమణి అకాలీదళ్‌, సీపీఐ(ఎంఎల్‌), పీఏజీడీ (గుప్కర్‌ కూటమి), తృణమూల్‌ కాంగ్రెస్‌, తెరాస, ఎంఐఎం, ఆప్‌, జేడీఎస్‌, బీఎస్పీ, పీడబ్ల్యూపీ, బీవీఏ, ఆర్‌ఎస్‌పీ, ఫార్వార్డ్‌ బ్లాక్‌, ఎస్‌యూసీఐ (సీ), జ్వరాజ్‌ ఇండియా పార్టీలు తమ పూర్తి మద్దతును తెలిపాయి. మంగళవారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు బంద్‌ జరుగుతుందని రైతులు ప్రకటించిన విషయం తెలిసిందే.

మరోవైపు, కేంద్రం ఈ మూడు చట్టాలను వెనక్కి తీసుకొనేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు తేల్చిచెప్పారు. ఇప్పటికే ఐదు దఫాలుగా కేంద్రం చర్చలు జరిపినా కొలిక్కిరాలేదు. మరోసారి ఈ నెల 9న రైతు సంఘాలతో కేంద్రమంత్రులు చర్చలు జరపనున్నారు.

ఇవీ చదవండి..

ఆ నాలుగు గంటలే బంద్‌‌: రైతు సంఘాలు

రైతుల వద్దకు కేజ్రీవాల్‌!

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని