Uttar Pradesh: 313 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే!

మరికొన్ని నెలల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తం 403 స్థానాలు ఉండగా.. 396 మంది ఎమ్మెల్యేలపై ‘ది అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫామ్స్‌’ సంస్థ సర్వే నిర్వహించి ఒక నివేదిక రూపొందించింది. మంగళవారం విడుదల చేసిన

Updated : 24 Nov 2021 00:36 IST

140 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు: ఏడీఆర్‌ నివేదిక

లఖ్‌నవూ: వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 403 స్థానాలు ఉండగా.. 396 మంది ఎమ్మెల్యేలపై ‘ది అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫామ్స్‌’ (ఏడీఆర్‌) సంస్థ సర్వే నిర్వహించి ఓ నివేదికను రూపొందించింది. మంగళవారం విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. మొత్తం ఎమ్మెల్యేల్లో 35 శాతం అంటే 140మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. 27శాతం మంది ఎమ్మెల్యేలకు నేరాలతో సంబంధం ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేల్లో 18 మందిపై, బీఎస్పీలో ఇద్దరిపై, కాంగ్రెస్‌లో ఒక ఎమ్మెల్యేపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు పేర్కొంది. 

* మొత్తం 396 మంది ఎమ్మెల్యేల్లో 313 మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరిలో భాజపాకు చెందిన వారు 235 మంది కాగా.. ఎస్పీలో 42 మంది, బీఎస్పీలో 15 మంది, కాంగ్రెస్‌లో ఐదుగురు చొప్పున కోటీశ్వరులు ఉన్నారు. 

* 396 మంది ఎమ్మెల్యేల్లో 95మంది 12వ తరగతి కంటే తక్కువే చదువుకున్నారు.

* నలుగురు ఉన్నత చదువులు చదుకోగా.. ఐదుగురు డిప్లొమా పట్టా సాధించారు.

* 206 మంది ఎమ్మెల్యేల వయసు 25 నుంచి 50 మధ్య ఉండగా.. 190 మంది ఎమ్మెల్యేల వయసు 51 నుంచి 80 ఏళ్ల మధ్య ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు