జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 45.97 శాతం పోలింగ్‌

 గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 45.97 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ శాతం కంటే ఎక్కువ నమోదైనట్లు లోకేష్‌కుమార్‌ తెలిపారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 45.27 శాతం పోలింగ్‌ 

Updated : 24 Sep 2022 14:38 IST

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 45.97 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ శాతం కంటే ఎక్కువ నమోదైనట్లు లోకేష్‌కుమార్‌ తెలిపారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 45.27 శాతం పోలింగ్‌ నమోదైంది. గతంతో పోలిస్తే ఈ సారి స్వల్పంగా పోలింగ్‌ శాతం పెరిగింది. అయితే  మొదటి నుంచి ఎన్నికల పోలింగ్‌ మందకొడిగానే సాగింది. సాయంత్రం 5 గంటల వరకు 36.73 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ ముగుస్తున్న సమయంలో ఓటింగ్‌ ఎక్కువగా జరిగింది. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడం, కరోనా భయం పోలింగ్‌పై పడింది. లేకుంటే ఇంకా ఎక్కువ శాతం పెరిగేదే. ఇక ఓల్డ్‌ మలక్‌ పేట మినహా 149 డివిజన్లలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. గురువారం ఓల్డ్‌మలక్‌పేటలో రీపోలింగ్‌ జరగనుంది. 
  
గతంలో గ్రేటర్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలు..

2002లో ఎంసీహెచ్  ఎన్నికల్లో 41.04 శాతం  పోలింగ్‌ నమోదైంది. 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 42.95 శాతం, 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.27 శాతం పోలింగ్‌ నమోదైంది. 2014లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో 50.86 శాతం,  2018 ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో 53 శాతం పోలింగ్‌ నమోదైంది. 
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని