BRS: భారాసలో చేరిన 50 మంది మహారాష్ట్ర సర్పంచ్‌లు

మహారాష్ట్రకు చెందిన 50 మంది సర్పంచ్‌లు కేసీఆర్‌ సమక్షంలో భారాస పార్టీలో చేరారు. కేసీఆర్‌ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated : 07 Jun 2023 22:07 IST

హైదరాబాద్‌: దేశ ప్రజలకు తాగు, సాగునీరు, విద్యుత్తు నేటికీ సరిగా అందట్లేదని భారత్‌ రాష్ట్ర సమితి (BRS) అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆక్షేపించారు. కేంద్ర పాలకుల నిర్లక్ష్య ధోరణులపై ప్రజలను జాగృతం చేయాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని 50మంది సర్పంచ్‌లు సీఎం సమక్షంలో బుధవారం భారాసలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. తెలంగాణలాగా ఇతర రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధి చెందట్లేదని ప్రశ్నించారు. చంద్రుడు, చుక్కలను తెచ్చివ్వాలని కేంద్రంలోని భాజపా నేతలను అడుగుతున్నామా? అని అన్నారు. తాగు, సాగు నీరు, విద్యుత్ ఇస్తే చాలని అడుగుతున్నామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని