UP Election 2022: చివరి దశకు చేరుకున్న పోలింగ్.. అందరి దృష్టి వారణాసిపైనే

కొద్ది రోజులుగా ఐదు రాష్ట్రాలకు జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికలు చివర దశకు వచ్చేశాయి.

Published : 07 Mar 2022 11:44 IST

లఖ్‌నవూ: కొద్ది రోజులుగా ఐదు రాష్ట్రాలకు జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికలు చివర దశకు చేరాయి. ఈ రోజు ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతోన్న ఏడో విడత పోలింగ్‌తో ఈ ఎన్నికలు ముగియనున్నాయి. ఈ దశలో 54 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసి కూడా ఈ పోలింగ్‌లో భాగమైంది. ప్రస్తుతం అందరి దృష్టి దానిపైనే ఉంది. ఓటర్లు మొత్తం 613 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.

ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా.. తొమ్మిది గంటల సమయం వరకు 8.58 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించినా.. అధికారులు తగిన ఏర్పాటు చేశారు. కాగా, ఈ 54 స్థానాల్లో 48 సీట్లలో భాజపా పోటీ పడుతుండగా.. మిగిలిన వాటిని మిత్ర పక్షాలకు కేటాయించింది. ఎస్పీ 45  స్థానాల్లో బరిలో నిలిచింది. ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కౌటింగ్ మార్చి 10న జరగనుంది. నేటి సాయంత్రం వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్ వెల్లడికానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని