నితీశ్‌ కుమార్‌కు తేజస్వి మద్దతు

రాజకీయాలంటే ప్రత్యర్ధులు పరస్పరం దుమ్మెత్తి పోసుకోవటమే తప్ప సానుకూలంగా స్పందించే సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి.

Updated : 05 Nov 2020 04:31 IST

ఏ విషయంలో అంటే..

పట్నా: రాజకీయాలంటే ప్రత్యర్ధులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటమే తప్ప.. సానుకూలంగా స్పందించే సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి. కాగా ఆ విధమైన సంఘటన ఒకటి బిహార్‌లో చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు నిరసనగా జరిగిన ఓ అనూహ్య ఘటనను ఆయన ప్రత్యర్థి, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌ ఖండించారు. వివరాలు ఇలాఉన్నాయి. ఇక్కడి మధుబని ప్రాంతంలో జరిగిన ఓ బహిరంగ సభలో.. ఉల్లిధరల పెరుగుదలకు నిరసనగా ఓ వ్యక్తి నితీశ్‌ కుమార్‌పై  ఉల్లిపాయలు విసిరాడు. భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకోగా.. అతనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అతన్ని వెళ్లనివ్వాలని సూచించి హుందాగా వ్యవహరించారు. 

కాగా, మహాకూటమి తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ ఈ సంఘటనను ఖండించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కారాదని.. ప్రజలు నిరసనను తెలిపేందుకు ప్రజాస్వామ్యయుతమైన అనేక విధానాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఓటింగు ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను తెలుపవచ్చని ఆయన సూచించారు. ఉల్లి ధరలు తదితర అంశాలపై తమ పార్టీ పోరాటం సాగిస్తుందమని తెలిపిన తేజస్వి.. ఈ వైఖరి తనకు సమ్మతం కాదన్నారు. మంగళవారం నాటి రెండో విడత బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 53.1 శాతం ఓట్లు పోలయ్యాయి. కాగా, నవంబర్‌ 7 నాడు తుది విడత పోలింగ్‌ అనంతరం నవంబర్‌ 10న ఫలితాలు విడుదల కావచ్చని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని