కలిసి పనిచేస్తే విజయం మనదే:ఠాగూర్
కాంగ్రెస్ నేతలంతా జట్టుగా కలిసి పని చేస్తే రాబోయే ఎన్నికలలో కచ్చితంగా విజయం సాధిస్తామని ఏఐసీసీ తెలంగాణ బాధ్యుడు మణికం ఠాగూర్ ధీమా వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, కలిసి ఐక్యంగా పనిచేయడం చాలా ముఖ్యమని నేతలకు హితబోధ చేశారు. ఏఐసీసీ తెలంగాణ బాధ్యుడిగా నియామకం అయిన తర్వాత మణికం ఠాగూర్ గాంధీభవన్‌కు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
హైదరాబాద్: కాంగ్రెస్ నేతలంతా జట్టుగా కలిసి పని చేస్తే రాబోయే ఎన్నికలలో కచ్చితంగా విజయం సాధిస్తామని ఏఐసీసీ తెలంగాణ బాధ్యుడు మణికం ఠాగూర్ ధీమా వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, కలిసి ఐక్యంగా పనిచేయడం చాలా ముఖ్యమని నేతలకు హితబోధ చేశారు. ఏఐసీసీ తెలంగాణ బాధ్యుడిగా నియామకం అయిన తర్వాత మణికం ఠాగూర్ గాంధీభవన్‌కు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెలలో రెండు సార్లు తప్పకుండా కోర్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అన్ని విషయాలు అందులో చర్చించుకుందామన్నారు. తనతో పార్టీ అంశాలు ఎప్పుడైనా మాట్లాడవచ్చన్నారు. అన్ని వేళలా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నిరంతరం క్షేత్ర స్థాయి ఉద్యమాలు చేయాలని, నిరంతరం ప్రజల్లో ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 28న గవర్నర్‌కు వినతిపత్రం అందజేయాలని, అక్టోబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్, మాజ్దూర్ బచావో దినంగా పాటించాలని ఠాగూర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది రైతులు, వ్యవసాయ కార్మికులతో సంతకాల సేకరణ చేయించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ముఖ్య నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఈ బిల్లుల విషయంలో తెలివిగా వ్యవహరిస్తున్నారని ఠాకూర్ పేర్కొన్నారు. అన్ని బిల్లుల విషయంలో అందరికంటే ముందుగానే భాజపాకి, మోదీకి మద్దతు ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ రైతుల పక్షాన పెద్దఎత్తున పోరాటం చేయాలని..ప్రజల్లో పోరాటాలు, క్షేత్ర ఉద్యమాలతో జనం మధ్య ఉండాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, సోనియా త్యాగంతోనే తెలంగాణ సాధ్యం అయ్యిందన్నారు. ఆ త్యాగాన్ని జనంలోకి తీసుకెళ్లి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి మనం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి బహుమతిగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయాలి: ఉత్తమ్
కేంద్రం చేసిన మూడు వ్యవసాయ బిల్లుల విషయంలో ఏఐసీసీ పిలుపు మేరకు క్షేత్ర స్థాయి ఉద్యమాలు చేయాల్సి ఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ పేర్కొన్నారు. రైతులకు తీవ్రంగా నష్టం చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా బిల్లులు రూపొందించారని ఆయన విమర్శించారు. మార్కెట్ యార్డు బయట కూడా వ్యయసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడంవల్ల వ్యాపారులపై నియంత్రణ ఉండదన్నారు. ఉత్పత్తుల అమ్మకాలను ఎక్కడైనా అమ్ముకోవచ్చు, నిత్యావసర వస్తువుల స్టాక్‌లో నియంత్రణ లేకుండా చేయడం లాంటి బిల్లుల వల్ల దేశంలో రైతులకు చాలా నష్టం జరుగుతుందని ఉత్తమ్ పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్ పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు చాలా నష్టపోతాన్నారు. ఈ బిల్లులు పూర్తిగా కార్పొరేట్ వ్యాపారుల కోసమే భాజపా ప్రభుత్వం తీసుకువచ్చిందని ఉత్తమ్ విమర్శించారు. ఈ విషయాలపై ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణలో వరుస ఉద్యమాలను చేపట్టామని ఉత్తమ్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొనసాగుతున్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. ఓటు వేయనున్న సీఎం రేవంత్
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్‌కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్‌సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్‌కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్‌ను తాడేపల్లి ప్యాలెస్‌లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్‌లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. -
రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డికి అసమ్మతి సెగ
‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్‌రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. -
మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. -
పవన్‌కల్యాణ్‌తో నాయకుల సమావేశం
ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యారు. -
తెలిసే.. వదిలేశారా?
అధికార వైకాపా తాయిలాల పంపిణీలో దూసుకుపోతుంటే తిరుపతి జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీల ఉమ్మడి భేటీలు
ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. -
కేసుల్లోనూ నంబర్ వన్ ముఖ్యమంత్రి జగనే
దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్‌రెడ్డి ఎద్దేవా చేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోరం..
అనంతపురం జిల్లా శింగనమల మండల వైకాపా మాజీ కన్వీనర్, అసమ్మతి నాయకుడు పట్నం నగేశ్ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే
రాష్ట్రంలో పోటీ చేయనున్న పది అసెంబ్లీ స్థానాలకు భాజపా అధినాయకత్వం బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో సుజనాచౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డిలకు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన అనుభవం ఉంది. -
క్యాష్ కొట్టు.. బస్సులు పట్టు
ఇటీవల వైకాపా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు 8,700 ఆర్టీసీ బస్సులు తీసుకున్నారు. వీటికి ఆ పార్టీ దాదాపు రూ.20 కోట్ల వరకు చెల్లించింది. -
భాజపా లోక్‌సభ స్థానాలకు ఇన్ఛార్జుల నియామకం
రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తున్న లోక్‌సభ స్థానాలకు సీనియర్ నేతలను ఇన్‌ఛార్జులుగా ఆ పార్టీ నియమించింది. వీరిలో నలుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. -
డబ్బు తరలించడానికే ఆ కంటెయినర్
అయిదేళ్లుగా అడ్డదారిన ఆర్జించిన రూ.వేల కోట్ల సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటెయినర్లో తరలించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైకాపా అభ్యర్థులకు పంచడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. -
తొలిదశకు ముగిసిన నామినేషన్లు
లోక్‌సభ ఎన్నికల తొలిదశకు నామినేషన్ల గడువు బుధవారం ముగిసింది. ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
టీఎంసీ దోచుకున్న సొమ్ము పేదలకే
పశ్చిమబెంగాల్లో పేదల నుంచి కొందరు దోచుకున్న రూ.3,000 కోట్లు తిరిగి బడుగులకే దక్కేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. -
అమరావతి భాజపా అభ్యర్థిగా నవనీత్ రాణా
మహారాష్ట్రలోని అమరావతి నుంచి ప్రస్తుతం స్వతంత్ర ఎంపీగా ఉన్న సినీ నటి నవనీత్ రాణాకు భాజపా లోక్‌సభ టికెట్ ఇచ్చింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో తొలి నుంచి పోరాడుతున్న ఆమెను భాజపా తమ పార్టీలో చేర్చుకుని సీటు కేటాయించింది.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతున్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. ఓటు వేయనున్న సీఎం రేవంత్
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్‌గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
-
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్‌కు కాంగ్రెస్ షాక్!
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186