‘భారత్‌ బయోటెక్‌ కృషి అభినందనీయం’

కొవిడ్‌ వ్యాక్సిన్‌ విషయంలో భారత్‌ బయోటెక్‌ చేస్తున్న కృషి అభినందనీయమని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. తెలంగాణ ఖ్యాతిని భారత్‌ బయోటెక్‌ ఇనుమడింపజేసిందని

Updated : 09 Sep 2020 15:38 IST

హైదరాబాద్‌: కొవిడ్‌ వ్యాక్సిన్‌ విషయంలో భారత్‌ బయోటెక్‌ చేస్తున్న కృషి అభినందనీయమని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. తెలంగాణ ఖ్యాతిని భారత్‌ బయోటెక్‌ ఇనుమడింపజేసిందని కొనియాడారు. ప్రస్తుతం వ్యాక్సిన్‌ రెండో దశ ప్రయోగంలో ఉందన్నారు. శాసనసభలో కరోనాపై చేపట్టిన స్వల్పకాలిక చర్చలో అక్బరుద్దీన్‌ మాట్లాడారు. భారత్‌ బయోటెక్‌తో సీఎం సమావేశం ఏర్పాటు చేయాలని.. కేంద్రంతో సంబంధం లేకుండా తెలంగాణలో వ్యాక్సిన్‌ ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం దీనిపై సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ భారత్‌ బయోటెక్‌తో మాట్లాడుతున్నామని.. సొంత రాష్ట్రం కనుక వ్యాక్సిన్‌ పంపిణీలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. 

అంతకుముందు కరోనాపై మాట్లాడేందుకు తమకు సమయం ఇవ్వకపోవడంపై అక్బరుద్దీన్‌ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి ఈటల ప్రకటనలో కరోనా యోధుల గురించి ప్రస్తావనే లేదని విమర్శించారు. కరోనా యోధులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులకు సెల్యూట్‌ చేస్తున్నానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు