నాని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవి: సజ్జల

ప్రధాని నరేంద్రమోదీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Updated : 24 Sep 2020 16:31 IST

అమరావతి: ప్రధాని నరేంద్రమోదీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దేశ ప్రధానిపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కొడాలి నాని వాస్తవాన్ని గ్రహించి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. అమరావతిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు చెప్తే తప్ప ప్రధానిపై నాని ఏం వ్యాఖ్యలు చేశారో తెలియదన్నారు. తెదేపా నేతలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మోదీ గురించి పార్టీలో ఎవరైనా సరే వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదని.. నేతలు సంయమనం పాటించాలని సజ్జల సూచించారు. 

ఇదీ చదవండి..

భాజపాపై మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని