
నా కుమారుడికి లక్షల్లో ఫ్యాన్స్: ఏపీ మంత్రి
ఆ బెంజ్‌కారుతో మాకు సంబంధం లేదు
అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలను ఖండించిన గుమ్మనూరు జయరాం
అమరావతి: తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను మంత్రి గుమ్మనూరు జయరాం ఖండించారు. తన కుమారుడికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో అభిమానులున్నారని.. దీనిలో భాగంగా ఆయన చేతులుమీదుగా చాలా మంది బహుమతులు అందుకుంటారని చెప్పారు. అయ్యన్న చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆయన చెప్పిన బెంజ్ కారుకు తమకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. తన కుమారుడి పేరిట కారు రిజిస్ట్రేషన్ ఉన్నట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని జయరాం సవాల్ విసిరారు.
మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్‌కు ఓ కేసులో ఏ14 నిందితుడిగా ఉన్న వ్యక్తి బెంజికారు బహుమతిగా ఇచ్చారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. మంత్రి జయరాంకు ఏ14గా ఉన్న వ్యక్తి బినామీ అని పేర్కొన్నారు. మంత్రికి బినామీ కాబట్టే ఆయన కుమారుడికి ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చారని అయ్యన్న విమర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రి జయరాం స్పందించారు. అయ్యన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
ఇదీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.