భాజపాపై మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు

హిందూ ఆలయాలపై తాను చేసిన వ్యాఖ్యలపై ఎవరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. తిరుమల డిక్లరేషన్‌ అంశంలో ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో

Published : 24 Sep 2020 00:58 IST

తిరుపతి: హిందూ ఆలయాలపై తాను చేసిన వ్యాఖ్యలపై ఎవరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. తిరుమల డిక్లరేషన్‌ అంశంలో ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేబినెట్‌ నుంచి తొలగించాలంటూ రాష్ట్ర భాజపా నేతలు చేసిన డిమాండ్‌పై మంత్రి స్పందించారు. సీఎం జగన్‌ డిక్లరేషన్‌ ఇచ్చి సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకోవాలని భాజపా డిమాండ్‌ చేసిన నేపథ్యంలో ఆ పార్టీపై మంత్రి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. 

‘‘పది మందిని వెంటబెట్టుకెళ్లి అమిత్‌షా, కిషన్‌రెడ్డిని తొలగించాలంటే తొలగిస్తారా? రాష్ట్రంలో గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన భాజపా మాటలు హాస్యాస్పదం. అత్యధిక ఓట్లు వచ్చిన జగన్‌కు సలహాలు ఇచ్చే స్థాయి భాజపాకు ఉందా? ప్రధాని మోదీని తన సతీమణిని తీసుకెళ్లి రామాలయంలో పూజలు చేయమనండి. మోదీ, యూపీ సీఎం మాత్రం ఒంటరిగా ఆలయాలకు వెళ్తారు.. జగన్‌ మాత్రం కుటుంబసమేతంగా ఆలయానికి రావాలా? ఎవరి పార్టీ విధానాలు వారికి ఉంటాయి. సోము వీర్రాజు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక ఆలయాలపై దాడులు జరిగాయంటే ఆయన్ను తొలగిస్తారా? నోటా కంటే ఎక్కువ ఓట్లు ఎలా తెచ్చుకోవాలనే దానిపై భాజపా ఆలోచించుకోవాలి. అంతేకానీ మా పార్టీలో ఎవరిని ఉంచాలి.. ఎవరిని తీసేయాలనే విషయాలను జగన్‌కు భాజపా నేతలు చెప్పేదేంటి? ఎవరి పార్టీ వ్యవహారాలు వాళ్లు చూసుకుంటే మంచిది’’ అంటూ కొడాలి నాని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు