Mekapati Goutham Reddy: రాజధానిపై మంత్రి గౌతమ్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

రాజధాని అంశంపై ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నారు.

Updated : 31 Aug 2021 19:49 IST

విజయవాడ: రాజధాని అంశంపై ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడ్నుంచి పనిచేస్తే అదే రాజధాని అవుతుందని.. అది పులివెందుల, విజయవాడ లేదా విశాఖ ఏదైనా కావొచ్చని గౌతమ్‌రెడ్డి అన్నారు. తిరుపతి ఎస్‌వీయూ సెనేట్‌ హాలులో జిల్లా అభివృద్ధి మండలి సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదని, ముఖ్యమంత్రి ఎక్కడ నివాసం ఉంటే అదే రాజధాని అని అభిప్రాయపడ్డారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం 3 రాజధానులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని