పార్టీ అధ్యక్షురాలిగా సోనియానే ఉండాలి

కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ మార్పుపై పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ సోమవారం లేఖ రాశారు. పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే ఉండాలని లేఖలో కోరారు. ఎన్నో క్లిష్ట పరిస్థితుల నుంచి పార్టీ గట్టెక్కడానికి...

Updated : 24 Aug 2020 12:43 IST

లేఖ రాసిన ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌

విజయవాడ: కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ మార్పుపై పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ సోమవారం లేఖ రాశారు. పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే ఉండాలని లేఖలో కోరారు. ఎన్నో క్లిష్ట పరిస్థితుల నుంచి పార్టీ గట్టెక్కడానికి సోనియా చేసిన కృషి మరువలేమన్నారు. సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వ్యక్తిత్వం గాంధీ కుటుంబానిదని చరిత్ర చెబుతోందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడి ఎన్నో సందర్భాల్లో దేశ ప్రతిష్ఠను పెంచిన ఠీవి సోనియా గాంధీదని ఆయన కొనియాడారు.

తప్పనిసరి పరిస్థితుల్లో నాయకత్వ మార్పు ఆలోచన ఉంటే.. రాహుల్‌ గాంధీ ముందుకు వస్తే ఆయనకే ఇవ్వాలని సూచించారు. ఎంతో కాలం పార్టీ పగ్గాలు ఆయన చేపట్టాలని శ్రేణులు ఆకాంక్షిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రమాదంలో పడిన రాజ్యాంగ పరిరక్షణ, లౌకికరాజ్య మనుగడకు రాహుల్‌ నాయకత్వం అవసరమని ఈ సందర్భంగా శైలజానాథ్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితిలో పార్టీని రక్షించే ధైర్యం, దమ్ము గాంధీ కుటుంబానికే ఉంది తప్ప కాంగ్రెస్‌ పార్టీని వేరేవారు బలోపేతం చేయలేరని లేఖ ద్వారా శైలజానాథ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని