Updated : 15/11/2020 11:46 IST

పెద్ద పార్టీలతో పొత్తు ప్రసక్తే లేదు: అఖిలేశ్

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో భాజపా హయాంలో అవినీతి పెరిగిపోయిందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శించారు. రాబోయే 2022 ఎన్నికల్లో ఎస్పీ నుంచి విడిపోయి ప్రత్యేక పార్టీ పెట్టిన తన బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌తో కలిసి బరిలోకి దిగేందుకు సానుకూల సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘రాబోయే ఎన్నికల్లో చిన్న పార్టీలతోనే సర్దుకు పోతాం కానీ.. పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. బీఎస్పీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. శివపాల్‌ యాదవ్‌కు చెందిన ప్రగతి శీల సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు కుదిరితే ఆ పార్టీ నాయకుడికి కేబినెట్‌ బెర్త్‌ ఇవ్వడానికి సిద్ధం’ అని అఖిలేశ్‌ తెలిపారు. 

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సహా యూపీలో జరిగిన ఉపఎన్నికలను ఉద్దేశిస్తూ అఖిలేశ్‌ భాజపాపై పలు విమర్శలు చేశారు. ఈవీఎంల ద్వారా అవకతవకలు జరిగాయంటూ భాజపాపై పరోక్ష ఆరోపణలు చేశారు. ‘ఇటీవల బిహార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ప్రజల మద్దతు ఎక్కువగా మహాకూటమికే కనిపించింది. ఎగ్జిట్‌పోల్స్‌ సైతం ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమికే పట్టం కట్టాయి. కానీ తీరా ఈవీఎం ఓట్లు లెక్కించాక ఫలితం తారుమారైంది. అనూహ్యంగా ఊహించని అభ్యర్థులు విజయం సాధించారు’ అంటూ పరోక్షంగా భాజపాను నిందించారు. యూపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం అధికారులను ప్రభావితం చేసిందని ఆరోపిస్తూనే.. రాష్ట్రంలో అవినీతి, అన్యాయం మితిమీరిపోతున్నాయని విమర్శించారు.  

అఖిలేశ్‌ యాదవ్‌ బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌ 2017 ఎన్నికల్లో జస్వంత్‌ నగర్‌ నుంచి ఎస్పీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2019 ఎస్పీ నుంచి బయటకు వచ్చి ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఫిరోజాబాద్‌ నుంచి పోటీ చేశారు. కాగా యూపీలో కాగా 2022 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉపఎన్ని్కల్లో భాజపా ఆరు, ఎస్పీ ఒక స్థానంలో గెలుపొందాయి. 


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్