నడ్డాకు కంగ్రాట్స్‌ చెప్పిన అమిత్‌ షా 

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా విజయ ఢంకా మోగించడంతో కమలనాథులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ........

Published : 11 Nov 2020 15:08 IST

దిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా విజయ ఢంకా మోగించడంతో కమలనాథులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఈ నేపథ్యంలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బుధవారం కలిసి అభినందనలు తెలిపారు. అపూర్వ విజయం సాధించడంపై హర్షం వ్యక్తంచేశారు. జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భాజపా కార్యకర్తలు దేశ అభివృద్దికి పునరంకితమై ఉన్నారని కొనియాడుతూ షా ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు