ఎన్నికలు జరపడం కమిషన్‌ విధి: నిమ్మగడ్డ 

ప్రభుత్వ అనుమతితో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఏపీ రాష్ట్ర

Updated : 06 Dec 2020 03:39 IST

అమరావతి: ప్రభుత్వ అనుమతితో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అన్నారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన తీర్మానంపై గవర్నర్‌కు ఎస్‌ఈసీ లేఖ రాశారు. రాజ్యాంగంలోని 243కె అధికరణ కింద ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి ఉందని.. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం కమిషన్‌ విధి అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లను సమాన అధికారాలు ఉంటాయని వివరించారు. ప్రభుత్వ అనుమతితో ఎన్నికలు జరపాలని ఆర్డినెన్స్‌ తీసుకొస్తే దాన్ని తిరస్కరించాల్సిందిగా గవర్నర్‌ను కోరారు. అవసరమైతే సుప్రీంకోర్టు న్యాయ నిపుణులను సంప్రదించాలని గవర్నర్‌కు ఎస్‌ఈసీ విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి..
ఆ చట్టాలపై ఆపోహలు తొలగించాలి: చంద్రబాబు

ప్రభుత్వం స్పందించకపోతే దీక్ష చేస్తా: పవన్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని