రాముడి ఆశీర్వాదంతో ప్రపంచానికే తలమానికం కావాలి

రామమందిర భూమిపూజ సందర్భంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌  దేశప్రజలకు అభినందనలు తెలియచేశారు.

Published : 06 Aug 2020 00:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేడు అయోధ్యలో రామమందిర భూమిపూజ సందర్భంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌  దేశప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.  శ్రీరాముడి ఆశీర్వాదంతో దేశం ప్రపంచానికే తలమానికం కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ’’శ్రీరాముడి ఆశీర్వాదం మనందరికీ లభించాలి. ఆయన ఆశీస్సులతో దేశంలో ఆకలి, నిరక్షరాస్యత, పేదరికం వంటివి అంతమై భారత్‌ ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన దేశంగా నిలవాలి. ప్రపంచానికే భారత్‌ మార్గదర్శకత్వం వహించే రోజు రావాలి. జై శ్రీరామ్‌!’’ అని ట్విటర్‌లో ప్రకటించారు. కాగా, అయోధ్యలో శ్రీరామ మందిర భూమిపూజ కార్యక్రమం ఈ మధ్యాహ్నం 12:44 గంటలకు జరుగనున్న సంతతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని