Published : 14/08/2020 13:39 IST

ఇది సత్యం సాధించే విజయం

విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అశోక్‌ గహ్లోత్‌

జైపుర్‌ : రాజస్థాన్‌లో శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. విజయంపై ధీమాగా ఉన్న ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ శాసనసభలో భాజపాకు కౌంటర్‌ ఇచ్చేందుకు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ ప్రారంభమైన వెంటనే వాయిదా పడింది. మధ్యాహ్నం 1 గంటకు సభ తిరిగి ప్రారంభం కాగానే విశ్వాస తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుంటామని స్పీకర్‌ సీపీ జోషి ప్రకటించారు..

ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందే తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ వర్గం తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరడంతో రాష్ట్రంలో గత నెల రోజులుగా నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన తొలిగిపోయింది.  తిరుగుబాటు చేసిన 18 మంది ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలో కలిసిపోయారు. దీంతో కాంగ్రెస్‌ బలం 107కి చేరింది. 200 మంది సభ్యులున్న ఈ సభలో మెజారిటీ మార్క్‌ 101. మరో 13 మంది స్వతంత్రులు కూడా గహ్లోత్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఆర్‌ఎల్‌పీకి ఉన్న ముగ్గురు సభ్యులతో కలిపి భాజపా బలం 75గా ఉంది.

ఇది ప్రజల విజయమని అసెంబ్లీ సమావేశాలకు ముందు అశోక్‌ గహ్లోత్‌ అన్నారు. ‘ఇది రాజస్థాన్‌ ప్రజల విజయమవుతుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఐక్యతకు ఇది నిదర్శనం. సత్యం సాధించే విజయం. సత్యమేవ జయతే’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని