విషమంగానే తరుణ్‌ గొగొయి ఆరోగ్యం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, అసోం మాజీ సీఎం తరుణ్‌ గొగొయి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఈమేరకు గువాహటి వైద్య కళాశాల సూపరింటెండెంట్‌ అబిజీత్‌ శర్మ వెల్లడించారు. శరీరంలోని పలు అవయవాల పనితీరు క్షీణించడంతో శనివారం సాయంత్రం ఆయన్ను గువాహటి వైద్యకళాశాలలో చేర్పించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా..

Published : 22 Nov 2020 15:35 IST

వెల్లడించిన  గువాహటి వైద్యకళాశాల

గువాహటి: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, అసోం మాజీ సీఎం తరుణ్‌ గొగొయి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఈమేరకు గువాహటి వైద్య కళాశాల సూపరింటెండెంట్‌ అభిజీత్‌ శర్మ వెల్లడించారు. శరీరంలోని పలు అవయవాల పనితీరు క్షీణించడంతో శనివారం సాయంత్రం ఆయన్ను గువాహటి వైద్యకళాశాలలో చేర్పించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ గొగొయి ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని సూపరింటెండెంట్‌ తెలిపారు. 85 ఏళ్ల గొగొయికి గత అక్టోబర్‌లో ఆయాసం రావడంతో గువాహటి వైద్య కళాశాలకు తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్లాస్మా థెరఫీ ద్వారా కోలుకున్న ఆయన అక్టోబర్‌ 25న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని